పండ్లు

Ulcer : అల్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్నారా.. అయితే రోజూ ఈ పండ్ల‌ను తినండి..!

Ulcer : చాలా మంది అల్సర్ల తో సతమతమవుతూ ఉంటారు. మీరు కూడా అల్సర్ తో బాధపడుతున్నారా..? అయితే, కచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవాలి. అల్సర్ కనుక మీకు కలిగినట్లయితే, కచ్చితంగా ఈ పండ్లని తీసుకోండి. ఈ పండ్లను తీసుకోవడం వలన, అల్సర్ త్వరగా మానిపోతుంది. అల్సర్ తగ్గాలంటే, స్ట్రాబెర్రీలని తీసుకోండి. కడుపు పూతల నుండి రక్షణ కవచంలా పనిచేస్తాయి స్ట్రాబెరీలు. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా వీటిలో ఎక్కువగా ఉంటాయి.

అల్సర్ల నుండి మిమ్మల్ని రక్షిస్తాయి. స్ట్రాబెర్రీ ఉదర గోడల్ని బలోపేతం చేస్తుంది కూడా. ప్రతిరోజు వీటిని తీసుకుంటే, సులభంగా అల్స‌ర్‌ నుండి బయటకు వచ్చేయొచ్చు. అల్సర్ లతో బాధ పడుతుంటే, దానిమ్మ పండు తీసుకోండి. దానిమ్మ పండ్లని తీసుకుంటే, ఉదర సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. దానిమ్మతో జీర్ణక్రియ సమస్యల నుండి కూడా బయట పడచ్చు. దానిమ్మ తొక్కలలో కూడా పోషకాలు ఉంటాయి. ఉత్తమ ఔషధంలా దానిమ్మ పనిచేస్తుంది.

if you are suffering from ulcer then take these foods

దానిమ్మ రసం తీసుకుంటే, పొట్టలో పుండ్లు, పేగుల్లో మంట తగ్గిపోతాయి. భోజనం తర్వాత ఒక గంట సేపు ఆగి ఆ తర్వాత దానిమ్మ తీసుకుంటే, అల్సర్ తగ్గుతుంది. కర్బూజాతో కూడా అల్సర్ సమస్య నుండి బయట పడొచ్చు. కర్బుజాలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కర్బూజ తీసుకుని ఈజీగా మనం చాలా సమస్యల నుండి బయట పడొచ్చు. ముఖ్యంగా అల్సర్ బాధ నుండి బయట పడవచ్చు.

పనసకాయ కూడా అల్సర్ నుండి బయట పడేస్తుంది. ఉదర సంబంధిత సమస్యల్ని సరి చేయగలదు పనస. జీర్ణ క్రియ ని ప్రోత్సహిస్తుంది. అలానే, కాలేయం పనితీరుపై కూడా ప్రభావితం చూపిస్తుంది. అల్సర్ తో బాధపడే వాళ్ళు సీతాఫలం తీసుకుంటే కూడా అల్సర్ సమస్య నుండి బయటపడచ్చు. ఇందులో ఉండే విటమిన్ ఏ అల్సర్ లకి ఎంతో మేలు చేస్తుంది. అల్సర్ ఉన్నవాళ్లు సీతాఫలం తీసుకుంటే, అల్సర్ సమస్య నుండి బయటపడవచ్చు. ఇలా ఈ పండ్లతో సులభంగా, మనం అల్సర్ సమస్య నుండి బయట పడవ‌చ్చు.

Share
Admin

Recent Posts