Diabetes : షుగ‌ర్ ఉందా ? ఏ పండ్ల‌ను తినాలో తెలియ‌డం లేదా ? అయితే వీటిని తీసుకోండి..!

Diabetes : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది డ‌యాబెటిస్ బారిన ప‌డుతున్నారు. టైప్ 1, 2 అని రెండు ర‌కాల డ‌యాబెటిస్ తో ఇబ్బందులు ప‌డుతున్నారు. వంశ పారంప‌ర్యంగా లేదా క్లోమ గ్రంథి ప‌నిచేయ‌క‌పోవ‌డం వ‌ల్ల టైప్ 1 డ‌యాబెటిస్ వ‌స్తుంది. అయితే టైప్ 2 డ‌యాబెటిస్ మాత్రం అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న‌విధానం వ‌ల్ల వ‌స్తుంది. క‌నుక టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారు ప‌లు జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తే షుగ‌ర్ లెవ‌ల్స్ ను త‌గ్గించుకుని డ‌యాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవ‌చ్చు.

if you have Diabetes then take these fruits into consideration

డ‌యాబెటిస్ ఉన్న‌వారు డైట్‌లో క‌చ్చితంగా అనేక మార్పులు చేసుకోవాలి. పిండి ప‌దార్థాలు ఉండే ఆహారాల‌ను త‌క్కువ‌గా, ప్రోటీన్లు, ఫైబ‌ర్ ఉండే ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. అప్పుడే షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. ఇక డ‌యాబెటిస్ ఉన్న‌వారు తినాల్సిన పండ్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. దానిమ్మ పండు

దానిమ్మ పండ్ల‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఒక పండులో దాదాపుగా 7 గ్రాముల మేర ఫైబ‌ర్ ల‌భిస్తుంది. అలాగే ఈ పండ్లలో 3 ర‌కాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నాశ‌నం చేసి క‌ణాల‌ను ర‌క్షిస్తాయి. దీంతోపాటు ఈ పండ్ల‌లో ఉండే విట‌మిన్ సి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గిస్తుంది. క‌నుక డ‌యాబెటిస్ ఉన్న‌వారు రోజుకు ఒక దానిమ్మ పండును తిన‌డం అల‌వాటు చేసుకుంటే మేలు జ‌రుగుతుంది.

2. ద్రాక్ష‌లు

రోజూ ఒక క‌ప్పు మోతాదులో ద్రాక్ష‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్నో పోష‌కాలు ల‌భిస్తాయి. దీంతోపాటు షుగ‌ర్ లెవ‌ల్స్ కూడా త‌గ్గుతాయి. ద్రాక్ష‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ల‌భిస్తాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె జ‌బ్బులు రాకుండా చూస్తాయి.

3. అర‌టి పండ్లు

షుగ‌ర్ ఉన్న‌వారు అర‌టి పండ్ల‌ను తినాలంటే సందేహిస్తుంటారు. కానీ రోజుకు ఒక అర‌టి పండును వారు తిన‌వ‌చ్చు. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ పెద్ద‌గా పెర‌గ‌వు. అయితే మ‌రీ బాగా పండిన అర‌టి పండ్ల‌ను మాత్రం తిన‌రాదు. వాటిల్లో చ‌క్కెర అధికంగా ఉంటుంది. ఒక మోస్త‌రుగా పండిన‌.. మ‌చ్చ‌లు లేని అర‌టి పండ్ల‌ను డ‌యాబెటిస్ ఉన్న‌వారు నిర్భ‌యంగా తిన‌వ‌చ్చు. దీని వ‌ల్ల శ‌రీరానికి పొటాషియం, ఫైబర్ ల‌భిస్తాయి. ఇవి షుగ‌ర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతాయి. శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తాయి. హైబీపీని త‌గ్గిస్తాయి. గుండె జ‌బ్బులు రాకుండా చూసుకోవ‌చ్చు.

4. నారింజ

డ‌యాబెటిస్ ఉన్న‌వారు రోజుకు ఒక నారింజ పండును కూడా నిర్భ‌యంగా తిన‌వ‌చ్చు. ఈ పండులో ఉండే విట‌మిన్ సి రోగ నిరోధ‌క శక్తిని పెంచ‌డంతోపాటు షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గించ‌డంలో స‌హాయం చేస్తుంది. క‌నుక నారింజ‌ను రోజూ తిన‌వ‌చ్చు. నారింజ పండ్ల‌లో ఉండే సెలీనియం షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గిస్తుంది.

5. స్ట్రాబెర్రీలు

షుగ‌ర్ ఉన్న‌వారు తినాల్సిన పండ్ల‌లో స్ట్రాబెర్రీలు ఒక‌టి. రోజుకు 3, 4 స్ట్రాబెర్రీ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్నో పోష‌కాలు ల‌భిస్తాయి. వీటిల్లో ఉండే విట‌మిన్ సి షుగ‌ర్ లెవ‌ల్స్ ను త‌గ్గించేందుకు స‌హాయ ప‌డుతుంది.

Share
Admin

Recent Posts