Apples : యాపిల్ పండ్లు మనకు ప్రకృతి అందించిన వరం అనే చెప్పవచ్చు. మనకు ఇవి ఏ సీజన్‌లో అయినా సరే లభిస్తాయి. యాపిల్ పండ్లు మనకు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. ఈ పండ్లలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగాలు రాకుండా చూస్తాయి. రోజూ ఒక యాపిల్ పండును తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు.. అనే సామెతను మీరు వినే ఉంటారు. అయితే అది అక్షరాలా సత్యం అనే చెప్పవచ్చు. ఈ క్రమంలోనే యాపిల్ పండ్లలో విటమిన్లు ఎ, కె లతోపాటు మాంగనీస్, బయోటిన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి మనల్ని వ్యాధుల నుంచి రక్షిస్తాయి.
యాపిల్ పండ్లను తినడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. దీంతో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అలాగే గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. అందువల్ల యాపిల్ పండ్లను రోజూ తినాల్సిందే. కనీసం రోజుకు ఒక పండును అయినా తింటే అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు. యాపిల్ పండ్లలో పెక్టిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది. మలబద్దకం సమస్య ఉన్నవారు రోజూ ఒక యాపిల్ పండును తింటే ఈ సమస్య నుంచి త్వరగా బయట పడవచ్చు. యాపిల్ పండును తినడం వల్ల జీర్ణక్రియ సైతం మెరుగు పడుతుంది.
బరువు తగ్గేవారికి వరం..
యాపిల్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమగా ఉంచుతాయి. కాంతివంతంగా మారుస్తాయి. ఈ పండ్లలోని విటమిన్ సి ఫ్రీ ర్యాడికల్స్‌తో పోరాడుతుంది. దీంతో ఇమ్యూనిటీ పెరుగుతుంది. యాపిల్ పండ్లలో క్యాలరీలు చాలా తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఒక పండును తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఫలితంగా ఇది బరువు తగ్గేవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఒక యాపిల్ పండ్లను రోజూ తినలేమని అనుకునే వారికి దీన్ని రోజూ భిన్న రకాలుగా తీసుకోవచ్చు. యాపిల్ పండు నుంచి జ్యూస్ తీసి తాగవచ్చు. అలాగే యాపిల్ పండుతో స్మూతీ తయారు చేసి తాగవచ్చు. లేదా చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రూట్ సలాడ్ లేదా వెజిటబుల్ సలాడ్‌లో కలిపి తినవచ్చు. లేదా వెజిటబుల్ సూప్ తయారు చేసి అందులో చిన్న ముక్కలుగా కట్ చేసి యాపిల్ ముక్కలను వేసి తినవచ్చు. ఇలా యాపిల్ పండ్లను రోజూ ఏ రూపంలో తిన్నా చాలు.. పైన చెప్పిన విధంగా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. కనుక యాపిల్ పండును రోజూ తింటే రోగాలు రాకుండా చూసుకోవచ్చు.