Banana : మనం ప్రతిరోజూ వివిధ రకాల పండ్లను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో అరటి పండ్లు ఒకటి. ఇవి మనకు తక్కువ ధరలో విరివిరిగా, దాదాపు సంవత్సరమంతా లభ్యమవుతూ ఉంటాయి. అరటి పండ్లల్లో కూడా పచ్చ అరటి పండ్లు, చక్కర కేళి అరటి పండ్లు, కేరళ అరటి పండ్లు, కొండ అరటి పండ్లు, అమృతపాని, కర్పూరం వంటి అనేక రకాలు ఉన్నాయి. మనం ఎక్కువగా పచ్చ అరటి పండ్లును తీసుకుంటూ ఉంటాం. మన ఆరోగ్యంతో పాటు అందానికి కూడా అరటి పండ్లు ఎంతగానో మేలు చేస్తాయి. అరటి పండ్ల వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అరటి పండ్లల్లో పిండిపదార్థాలు, మాంసకృత్తులు అధికంగా ఉంటాయి. ఇవి త్వరగా జీర్ణమవుతాయి.
వీటిని తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య నుండి విముక్తి కలుగుతుంది. అరటి పండ్లల్లో అధికంగా ఉండే పొటాషియం బీపీ ని, ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీర కండరాలను కూడా పొటాషియం ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాకుండా అరటి పండ్లల్లో అధికంగా ఉండే ఈ పొటాషియం శరీరంలో నీటి నిల్వలను కాపాడుతుంది. గుండె సంబంధిత వ్యాధులను ఆరికడుతుంది. విరోచనాలు, అల్సర్ , కడుపులో పుండ్లు వంటి వ్యాధులు పచ్చ అరటి పండ్లను తీసుకోవడం వల్ల నయం అవుతాయి. అరటి పండులో ఉండే పొటాషియం మూత్రపిండ వ్యాధులు ఉన్న వారికి ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తుంది.

ఉదయం పూట అరటిపండును తింటే మెదడు చురుకుగా పని చేస్తుంది. బాగా పండిన అరటి పండును పెరుగులో కలిపి తీసుకోవడం వల్ల స్త్రీలల్లో వచ్చే వైట్ డిశ్చార్జ్ సమస్య తగ్గుతుంది. అలాగే అరటి పువ్వు ఉడికించి తీసుకుంటే నెలసరి సమస్యలు, నెలసరి సమయంలో వచ్చే నొప్పులు, అధిక రక్తస్రావం వంటి సమస్యలను నయం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అరటి పండ్లల్లో ఉండే పోషకాలతో శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. అరటి పండ్లను తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. అరటి పండు గుజ్జును చర్మానికి రాసుకుని పది నిమిషాల తరువాత కడిగేస్తే చర్మం మృదువుగా మారుతుంది.
రెండు అరటి పండ్లు, తేనె,పెరుగు, గుడ్డు కలిపి బనానా షేక్ తయారు చేసుకుని ఉదయాన్నే తాగితే బలహీనంగా ఉన్న వారు బలంగా తయారవుతారు. రాత్రి భోజనం చేసిన తరువాత ఒక అరటి పండును తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది. దీనిని తీసుకోవడం వ్లల రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. ఉదయం అల్పాహారంతో అరటి పండును కలిపి తీసుకోవడం వల్ల మనకు మరింత మేలు కలుగుతుంది. అల్పాహారంతో అరటి పండును కలిపి తీసుకుంటే మన శరీరానికి చాలా మంచిది. ఉదయం పూట అరటి పండును తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా పని చేసుకోవచ్చు.
మచ్చలు ఉన్న అరటి పండులో క్యాన్సర్ తో పోరాడే గుణాలు అధికంగా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కృత్రిమంగా పండిన అరటి పండ్లకు బదులుగా సహజంగా పండిన అరటి పండ్లను తీసుకుంటే మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఎన్నో రకాలుగా మేలు చేస్తున్న ఈ అరటి పండు గురించి అపోహలను పక్కన పెట్టి ఈ రోజు నుండే రోజుకు ఒక అరటి పండును తినడం అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.