Water Apple : వాటర్ యాపిల్.. ఈ పండును మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. దీనిని రోజ్ ఆపిల్, జంబు ఫలం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పండ్లు నిమ్మజాతికి చెందినవి. ఈ మొక్క శాస్త్రీయ నామం సైజిజియం జాంబోస్. ఈ పండ్లు మనకు విరివిరిగా లభిస్తూ ఉంటాయి. వీటిని తినడం వల్ల మనం రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ వాటర్ యాపిల్ లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫైబర్, ప్రోటీన్, క్యాల్షియం,థయామిన్, నియాసిన్, ఐరన్, సల్ఫర్, పొటాషియం వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ పండ్లను తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. డయాబెటిస్ తో బాధపడే వారు ఈ పండ్లను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
డయాబెటిస్ తో బాధపడే వారు, డయాబెటిస్ వచ్చే సూచనలు ఉన్నవారు ఈ పండ్లను తినడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు. అంతేకాకుండా ఈ పండ్లను తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఈ పండ్లల్లో నీటి శాతం మరియు ఫైబర్ అధికంగా ఉంటుంది. నీళ్ల విరోచనాలు, మలబద్దకంతో పాటు ఇతర జీర్ణ సమస్యలను తగ్గించడంలో ఈ పండ్లు ఎంతో దోహదపడతాయి. వాటర్ యాపిల్స్ ను తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పండ్లను తినడం వల్ల మనం తరచూ ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. వీటిని తీసుకోవడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు కూడా తగ్గు ముఖం పడతాయి. అదే విధంగా ఈ పండ్లను తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.
గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండెకు సంబంధించిన సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. అంతేకాకుండా ఈ పండ్లను తినడం వల్ల శరీరంలో మలినాలు, విష పదార్థాలు తొలగిపోతాయి. శరీరం శుభ్రపడుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. అంటు వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. ఈ విధంగా వాటర్ యాపిల్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని వీటిని తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని వీటిని కూడా తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.