Healthy Foods : ప్రస్తుత కాలంలో డయాబెటిస్, కొలెస్ట్రాల్, రక్తహీనత, కీళ్ల నొప్పులు,నీరసం వంటి అనేక అనారోగ్య సమస్యల బారిన పడే వారు రోజురోజుకు ఎక్కువవుతున్నారు. ఇవే కాకుండా గుండె సంబంధిత సమస్యలు, రక్తపోటు, విటమన్ల లోపం వంటి అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా మనల్ని వేధిస్తున్నాయి. ఈ సమస్యలన్నింటికి మన ఆహారపు అలవాట్లు, జీవన విధానమే కారణమని చెప్పవచ్చు. ఇటువంటి అనారోగ్య సమస్యలను తగ్గించడంలో మనకు కొన్ని రకాల ధాన్యాలు ఎంతగానో ఉపయోగపడతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ ధాన్యాలను తీసుకోవడం ద్వారా నీరసం తగ్గడంతో పాటు శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
మన ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడే ధాన్యాల్లో ఉలవలు ఒకటి. ఉలవల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఉలవల్లో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం పలు రకాల అనారోగ్య సమస్యలు కూడా తగ్గు ముఖం పడతాయి. వీటిని నేరుగా తినడానికి బదులుగా వేయించి, ఉడికించి, మొలకెత్తించి తీసుకోవడం ఉత్తమం. అయితే పిత్త దోషాలు ఉన్న వారు మాత్రం వీటిని మూడు టీ స్పూన్ల ఉలవలను ఒక రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తినాలి. ఉలవల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి పోషణను పొందవచ్చు. ఉలవలను తినడం వల్ల బీపీ, షుగర్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కంటి సంబంధిత సమస్యలు తగ్గు ముఖం పడతాయి.
ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం తొలగిపోతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అధిక బరువు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలతో బాధపడే వారు ఉలవల పొడిని రెండు టీ స్పూన్ల మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ నీటిలో కలిపి రోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. కాలేయం మరియు మూత్రపిండాల సమస్యలతో బాధపడే వారు వీటిని తీసుకోవడం వల్ల ఆయా సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే మన ఆరోగ్యాన్ని కాపాడే ఇతర ధాన్యాల్లో పెసర్లు కూడా ఒకటి. వీటిలో ప్రోటీన్లతో పాటు విటమిన్స్, మినరల్స్ వంటి ఇతర పోషకాలు ఉంటాయి. పెసర్లను మొలకెత్తించి తీసుకోవడం వల్ల మనం ఎక్కువ పోషకాలను పొందడంతో పాటు చక్కటి ఫలితాలను కూడా పొందవచ్చు.
మొలకెత్తిన పెసర్లను అల్పాహారంలో భాగంగా తీసుకోవడం వల్ల రోజంతా అలసిపోకుండా ఉత్సాహంగా ఉండవచ్చు. కీళ్ల నొప్పులు, నీరసం, అలసట, అధిక బరువు, రక్తహీనత వంటి సమస్యలతో బాధపడే వారు పెసర్లను తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, డయాబెటిస్ ను నియంత్రించడంలో కూడా ఇవి మనకు ఉపయోగపడతాయి. ఇక మన ఆరోగ్యాన్ని సంరక్షించే ముఖ్యమైన ధాన్యాల్లో శనగలు ఒకటి. వీటిని కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. శనగల్లో కూడా ముఖ్యమైన పోషకాలు చాలా ఉంటాయి. వీటిని ఉడికించి, మొలకెత్తించి ఎలా తిన్నా కూడా మనకు మేలు కలుగుతుంది. శనగలను ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది.
అంతేకాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి పలు రకాల అనారోగ్య సమస్యల బారిన పడకుండా చేయడంలో కూడా ఇవి మనకు సహాయపడతాయి. షుగర్ వ్యాధితో బాధపడే వారు, రక్తపోటు ఉన్న వారు, రక్తహీనతో ఇబ్బందులకు గురి అవుతున్న వారు ఈ శనగలను ఆహారంగా తీసుకోవడం వల్ల అద్భుత ప్రయోజనాలను పొందవచ్చు. అనారోగ్య బాధపడే వారు అలాగే ఈ అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలనుకునే వారు ఈ ధాన్యాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.