పోష‌కాహారం

ఈ సీజ‌న్‌లో సీతాఫ‌లాన్ని విడిచిపెట్ట‌కుండా తినండి.. ఊపిరితిత్తులు మొత్తం క‌డిగేసిన‌ట్లు శుభ్ర‌మ‌వుతాయి..!

మ‌న‌కు సీజ‌న‌ల్‌గా ల‌భించే పండ్ల‌లో సీతాఫ‌లం కూడా ఒక‌టి. దీన్ని చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే సీజ‌న‌ల్‌గా ల‌భించే పండ్ల‌ను అధికంగా తినాల‌ని వైద్య నిపుణులు చెబుతుంటారు. వీటి వ‌ల్ల మ‌నం అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. ఇక సీతాఫ‌లం కూడా సీజ‌న‌ల్ పండే. క‌నుక దీన్ని కూడా ఎక్కువ‌గా తినాలి. సీతాఫ‌లాన్ని ఈ సీజ‌న్‌లో తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. సీతాఫ‌లంలో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అనేక పోష‌కాలు ఉంటాయి. అందువ‌ల్ల ఈ పండ్ల‌ను ఈ సీజ‌న్‌లో విడిచిపెట్ట‌కుండా తినాలి.

సీతాఫ‌లాల్లో విట‌మిన్ బి6 అధికంగా ఉంటుంది. ఇది యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ ప‌దార్థంగా ప‌నిచేస్తుంది. దీంతో ఊపిరితిత్తుల్లో వ‌చ్చే వాపులు త‌గ్గుతాయి. అలాగే ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి. ఈ సీజ‌న్‌లో మ‌న‌కు స‌హ‌జంగానే ద‌గ్గు, జ‌లుబు, ఆస్త‌మా వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. కాలుష్యం కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. క‌నుక సీతాఫ‌లాన్ని తింటే ఈ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌డంతోపాటు ఊపిరితిత్తుల‌ను కూడా శుభ్రంగా మార్చుకోవచ్చు. లంగ్స్ క‌డిగేసిన‌ట్లు క్లీన్ అవుతాయి. కాబ‌ట్టి ఈ సీజ‌న్‌లో సీతాఫ‌లాన్ని త‌ప్ప‌క తినాలి.

many wonderful health benefits of custard apple in this season

ఈ పండ్ల‌లో ప్రోటీన్లు, ఫైబ‌ర్ అధికంగా ఉంటాయి. క‌నుక శ‌రీరానికి త‌క్ష‌ణ శ‌క్తి ల‌భిస్తుంది. బ‌ల‌హీనంగా ఉన్న‌వారు, జిమ్ చేసేవారు, శారీర‌క శ్ర‌మ అధికంగా చేసేవారు ఈ పండ్ల‌ను తింటే శ‌రీరానికి త‌క్ష‌ణ‌మే శ‌క్తి ల‌భించి ఉత్సాహంగా మారుతారు. చురుగ్గా ప‌నిచేస్తారు. అల‌స‌ట రాదు. అలాగే ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది క‌నుక బ‌రువు త‌గ్గేందుకు, జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించేందుకు స‌హాయ ప‌డుతుంది. ముఖ్యంగా గ్యాస్‌, మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అలాగే అల్స‌ర్లు కూడా త‌గ్గుతాయి.

సీతాఫ‌లాల‌ను తిన‌డం వ‌ల్ల విట‌మిన్ సి అధికంగా ల‌భిస్తుంది. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. దీంతో వ్యాధులు, ఇన్ఫెక్ష‌న్లు త‌గ్గుతాయి. అలాగే ఈ పండ్ల‌లో ఉండే పొటాషియం, మెగ్నిషియం బీపీని త‌గ్గిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇక డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఈ పండ్ల‌ను తినేందుకు సంకోచిస్తుంటారు. కానీ సీతాఫ‌లం పండ్ల‌ను మ‌ధుమేహం ఉన్న‌వారు కూడా తిన‌వ‌చ్చు. అయితే మోతాదులోనే తినాలి. ఒక‌టి లేదా రెండు మీడియం సైజ్ పండ్ల‌ను రోజుకు ఒక‌సారి తిన‌వ‌చ్చు. ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల యాంటీ ఆక్సిడెంట్లు విరివిగా ల‌భిస్తాయి. ఇవి మ‌న‌స్సును ప్ర‌శాంతంగా ఉంచుతాయి. దీంతో డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

ఇలా సీతాఫ‌లం పండ్ల‌ను ఈ సీజ‌న్‌లో అధికంగా తిన‌డం వ‌ల్ల అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. కాబ‌ట్టి ఎక్క‌డ ఈ పండ్లు ల‌భించినా విడిచిపెట్ట‌కండి. రోజుకు క‌నీసం ఒక‌టి లేదా రెండు సీతాఫ‌లాల‌ను తింటే ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Admin

Recent Posts