Hormone Problems : మన శరీరంలో భిన్న రకాల హార్మోన్లు విధులను నిర్వర్తిస్తుంటాయనే విషయం తెలిసిందే. స్త్రీ, పురుషుల్లో భిన్న రకాల హార్మోన్లు ఉంటాయి. అయితే ఆ హార్మోన్లు కాకుండా మిగిలిన హార్మోన్లు ఇద్దరిలోనూ ఉంటాయి. ఈ క్రమంలోనే రోజూ హార్మోన్లు సరిగ్గా పనిచేయాల్సి ఉంటుంది. అవి అలా పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. కానీ కొందరిలో హార్మోన్ల అసమతుల్యతలు ఏర్పడుతుంటాయి. అలాంటి వారు కింద తెలిపిన ఆహారాలను రోజూ తీసుకోవాలి. దీంతో హార్మోన్లు సరైన స్థాయిలో విధులను నిర్వర్తిస్తాయి. దీని వల్ల ఆరోగ్యంగా ఉంటాం. మరి హార్మోన్లు సరిగ్గా పనిచేయాలంటే రోజూ తీసుకోవాల్సిన ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. హార్మోన్ల సమస్యలు ఉన్నవారు రోజూ అవిసె గింజలను గుప్పెడు మోతాదులో తీసుకోవాలి. నేరుగా వాటిని తినలేకపోతే పొడి రూపంలో తీసుకోవచ్చు. జ్యూసులు, వెజిటబుల్, ఫ్రూట్ సలాడ్స్ వంటి వాటిలో అవిసె గింజల పొడిని కలిపి తీసుకోవచ్చు. అవిసె గింజల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి హార్మోన్ల అసమతుల్యతలను తగ్గిస్తాయి. దీని వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.
2. క్యాబేజీ, కాలిఫ్లవర్, బ్రొకొలి వంటి కూరగాయలను రోజూ తీసుకోవడం వల్ల హార్మోన్లలో హెచ్చు తగ్గులు ఏర్పడకుండా ఉంటాయి.
3. రోజూ ఒక కప్పు కాకరకాయ జ్యూస్‌ను తాగితే ఎలాంటి హార్మోన్ల సమస్యలు ఉండవు. శరీరం సరిగ్గా తన విధులను తాను నిర్వర్తిస్తుంది.
4. మొలకెత్తిన గింజలను రోజూ ఒక కప్పు మోతాదులో తినాలి. రోజుకు ఒక గుడ్డును కూడా తీసుకోవాలి. ఇవి హార్మోన్లను సరిగ్గా పనిచేసేలా చేస్తాయి. మన శరీరానికి అవసరం అయిన పోషకాలను, శక్తిని అందిస్తాయి.
5. కొబ్బరినూనెను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కూడా హార్మోన్ల సమస్యలు పోతాయి. అలాగే పసుపును కూడా రోజూ తీసుకోవాలి. చేపలను వారంలో కనీసం 2 సార్లు తినాలి.
ఈ విధంగా ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యతలు తగ్గిపోతాయి. హార్మోన్లు సరిగ్గా పనిచేస్తాయి. అనేక వ్యాధులను తగ్గించుకోవచ్చు.