Mushrooms : మాంసాహారాన్ని మించిన పోషకాలు వీటి సొంతం.. ఒక కప్పు తింటే చాలు..

Mushrooms : ఒకప్పుడు అంటే పుట్ట గొడుగులు కేవలం వానాకాలం సీజన్‌లోనే మనకు లభించేవి. వీటిని ఎక్కువగా పొలాల గట్ల వెంబడి సేకరించేవారు. వర్షానికి పుట్టగొడుగులు ఎక్కువగా పుట్టుకు వస్తాయి. అయితే ఇప్పుడు మనకు ఇవి ఎప్పుడు అంటే అప్పుడే అందుబాటులో ఉంటున్నాయి. వీటిని చాలా మంది పెంచుతున్నారు. కనుక మనకు సీజన్లతో సంబంధం లేకుండా పుట్టగొడుగులు ఎప్పుడు అంటే అప్పుడే లభిస్తున్నాయి. అయితే పుట్ట గొడుగులు ఇతర కూరగాయలతో పోలిస్తే ఖరీదు ఎక్కువగానే ఉంటాయి. కనుక వీటిని తినేందుకు చాలా మంది సందేహిస్తుంటారు. కానీ వీటిని తప్పకుండా తినాల్సిందే. లేదంటే అనేక పోషకాలను, ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కోల్పోతారు.

పుట్టగొడుగులలో పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిని వయస్సు పైబడిన మహిళలు తింటే వారికి ఎంతగానో మేలు జరుగుతుంది. వాస్తవానికి పుట్టగొడుగుల్లో మాంసాహారాన్ని మించిన పోషకాలు ఉంటాయి. కనుక ఒక కప్పు పుట్టగొడుగులను తింటేనే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. తరచూ పుట్టగొడుగులను తినడం వల్ల మన శరీరానికి విటమిన్‌ డి ఎక్కువగా అందుతుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తుంది. అలాగే పుట్టగొడుగుల్లో ఉండే రైబోఫ్లేవిన్‌, నియాసిన్‌ వంటి బి కాంప్లెక్స్‌ విటమిన్లు మనకు ఎంతో మేలు చేస్తాయి. మనల్ని అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచుతాయి.

Mushrooms are great for nutrients take them one cup
Mushrooms

పుట్టగొడుగుల్లో ఉండే రైబోఫ్లేవిన్‌ ఎర్ర రక్త కణాలను పెంచుతుంది. దీంతో రక్తహీనత నుంచి బయట పడవచ్చు. అలాగే వీటిల్లో ఉండే నియాసిన్‌ చర్మాన్ని సంరక్షిస్తుంది. దీని వల్ల చర్మంపై ఉండే మచ్చలు, మొటిమలు పోతాయి. అలాగే చర్మంపై దద్దుర్లు రాకుండా ఉంటాయి. దీంతోపాటు జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. పుట్టగొడుగుల్లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు అధిక బరువును తగ్గించడంలోనూ ఉపయోగపడుతుంది.

పుట్టగొడుగులను తినడం వల్ల నాడీ మండల వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. దీంతో మెదడు యాక్టివ్‌గా ఉంటుంది. చురుగ్గా పనిచేస్తుంది. మతిమరుపు సమస్య తగ్గుతుంది. చిన్నారులు అయితే చదువుల్లో రాణిస్తారు. అలాగే నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. నిద్ర చక్కగా పడుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వీటిల్లో ఉండే సెలీనియం వంటి పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లలా పనిచేస్తాయి. ఇవి క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుంటాయి. దీంతో క్యాన్సర్‌ రాకుండా చూసుకోవచ్చు.

పుట్టగొడుగుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మారుస్తుంది. అలాగే వీటిని తినడం వల్ల హైబీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె సంబంధ సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. పుట్టగొడుగులను కనీసం వారంలో రెండు సార్లు అయినా తినే ప్రయత్నం చేస్తే.. పైన తెలిపిన విధంగా ప్రయోజనాలను పొందవచ్చు. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.

Editor

Recent Posts