Almonds And Cashews : మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో బాదంపప్పు, జీడిపప్పు కూడా ఒకటి. ఈ డ్రై ఫ్రూట్స్ చాలా రుచిగా ఉంటాయి. వీటిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. అలాగే ఈ బాదంపప్పు, జీడిపప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికి తెలిసిందే. అయితే మన ఇంట్లో ఉండే కొందరు పెద్దలు జీడిపప్పు, బాదంపప్పు వంటి వాటిని ఎక్కువగా తీసుకోకూడదు, వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం వివిధ దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెబుతూ ఉంటారు.
అయితే జీడిపప్పు, బాదంపప్పు వంటి డ్రై ఫ్రూట్స్ ను ఎవరు తీసుకోవాలి..ఎవరు తీసుకోకూడదు.. ఎలా తీసుకోవాలి….వంటి ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో బాదంపప్పు, జీడిపప్పు వంటి వాటిని కుస్తీ పోటీలల్లో పాల్గొనేవారు, వ్యాయామాలు చేసే వారు, బాడీ బిల్డర్స్ మాత్రమే ఎక్కువగా తీసుకునే వారు. అలాగే వీటిని కొనుగోలు చేయడానికి ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చేది. అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ రుచిగా ఉంటాయి కనుక వీటిని తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది. ఇంట్లో ఉండే పిల్లలు వీటిని ఒకేరోజూ అన్ని తినేస్తారన్న ఉద్దేశ్యంతో జీడిపప్పు, బాదంపప్పు వంటి వాటిని తింటే సులభంగా జీర్ణం అవ్వవు అని ఆ రోజుల్లో పెద్దలు చెప్పేవారు.
అంతేకానీ వీటిని ఎవరైనా ఆహారంలో భాగంగా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇవి అందరికి సులభంగా జీర్ణం అవుతాయని వీటిని ఎవరైనా తీసుకోవచ్చని వారు చెబుతున్నారు. సంవత్సరంన్నర పిల్లల నుండి పెద్దవారి వరుకు ఎవరైనా వీటిని తీసుకోవచ్చు. వీటిలో ప్రోటీన్ తో పాటు మంచి కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే మనలో చాలా మంది బాదంపప్పు, జీడిపప్పు వంటి వాటిని నెయ్యిలో వేయించి ఉప్పు, కారం, మసాలాలు చల్లుకుని తింటూ ఉంటారు. ఇలా అస్సలు తీసుకోకూడదని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ డ్రై ఫ్రూట్స్ ను నానబెట్టి మాత్రమే తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ను నేరుగా తీసుకోవడం వల్ల అవి త్వరగా జీర్ణం అవ్వవు.
అలాగే వీటిలో ఉండే పోషకాలను 60 నుండి 70 శాతం మాత్రమే మన శరీరం గ్రహిస్తుంది. మిగిలిన పోషకాలు మలం ద్వారా బయటకు వెళ్లి పోతాయి. అలాగే ఎండిన డ్రై ఫ్రూట్స్ జీర్ణం అవ్వడానికి 6 నుండి 7 గంటల సమయం పడుతుంది. కనుక డ్రై ఫ్రూట్స్ ను నానబెట్టి మాత్రమే తీసుకోవాలి. నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ 3 గంటల్లోనే జీర్ణం అవుతాయి. అలాగే నానబెట్టి తీసుకోవడం వల్ల వీటిలో ఉండే పోషకాలు పూర్తిగా మన శరీరానికి అందుతాయి. అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటిని కలిపి నానబెట్టకూడదు. వీటిని విడివిడిగా నానబెట్టాలి. కనీసం 6 నుండి 7 గంటల పాటైన వీటిని నానబెట్టి తీసుకోవాలి. అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ ను మన శరీరానికి కావల్సిన శక్తిని బట్టి, ఆకలిని బట్టి, మన జీర్ణశక్తిని బట్టి తీసుకోవాలి. గర్బిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలు, వ్యాయామాలు చేసే వారు, ఆటలు ఆడే వారు వీటిని ఎక్కువగా తీసుకోవాలి.