Dill Seeds : ఈ గింజ‌లు ఎక్క‌డ క‌నిపించినా స‌రే వ‌ద‌లొద్దు.. లాభాలు తెలిస్తే అస‌లు విడిచిపెట్ట‌రు..!

Dill Seeds : మ‌నం ఆహారంగా తీసుకోద‌గిన గింజ‌ల్ల‌లో శ‌త‌పుష్టి గింజ‌లు కూడా ఒక‌టి. వీటినే దిల్ సీడ్స్ అని కూడా అంటారు. శ‌త‌పుష్టి మొక్క నుండి ఈ గింజ‌లు మ‌న‌కు ల‌భిస్తాయి. ఆన్ లైన్ లో, సూప‌ర్ మార్కెట్ ల‌లో ఇవి మ‌న‌కు సుల‌భంగా ల‌భిస్తాయి. ఈ దిల్ సీడ్స్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. వీటిలో నువ్వుల కంటే ఎక్కువ‌గా క్యాల్షియం ఉంటుంది. అలాగే ఐర‌న్, ఫైబ‌ర్ వంటి పోష‌కాలు కూడా ఎక్కువ‌గా ఉంటాయి. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన స్థూల పోష‌కాలు, సూక్ష్మ పోష‌కాల‌న్నీ కూడా ఈ దిల్ సీడ్స్ లో ఉంటాయి.

100 గ్రాముల దిల్ సీడ్స్ లో 305 క్యాల‌రీల శ‌క్తి, 16 గ్రా. ప్రోటీన్, 14.5 గ్రా. ఫ్యాట్, 55 గ్రా. కార్బోహైడ్రేట్స్, 21 గ్రా. ఫైబర్, 21 మిల్లీగ్రా. విట‌మిన్ సి, 16 మిల్లీ గ్రా. ఐర‌న్, 1520 మిల్లీ గ్రా. క్యాల్షియం, 20మిల్లీ గ్రా. సోడియం, 5 మిల్లీ గ్రాముల జింక్, 12 మైక్రో గ్రా. సిలీనియం ఉంటుంది. గింజ‌లు కిలో దాదాపు 350 రూపాయ‌ల వ‌ర‌కు ఉంటాయి. ఈ దిల్ సీడ్స్ చ‌క్క‌టి రుచిని, వాస‌న‌ను క‌లిగి ఉంటాయి. ఈ దిల్ సీడ్స్ ను వేయించి పొడిగా చేసి కూరలు, స‌లాడ్స్, చ‌ట్నీ వంటి వాటిలో వేసుకుని తిన‌వ‌చ్చు. వంట‌ల్లో తాళింపులో కూడా ఈ గింజ‌ల‌ను మ‌నం వేసుకోవ‌చ్చు. అలాగే ఈ గింజ‌ల‌తో ల‌డ్డూల‌ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ గింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు ధృడంగా, ఆరోగ్యంగా త‌యార‌వుతాయి. ఎముకలు గుల్ల‌బార‌కుండా, ఎముక‌ల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు కూడా రాకుండా ఉంటాయి. ఈ దిల్ సీడ్స్ ను రాత్రి పూట భోజ‌నంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల నిద్ర‌లేమాఇ స‌మ‌స్య త‌గ్గుతుంద‌ని నిపుణులు ప‌రిశోధ‌న‌ల ద్వారా వెల్ల‌డించారు.

Dill Seeds health benefits in telugu know about them
Dill Seeds

అలాగే ప్రేగుల్లో క‌ద‌లిక‌ల్ని పెంచ‌డంలో, మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని పెంచ‌డంలో ఈ దిల్ సీడ్స్ ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. అదే విధంగా ఈ దిల్ సీడ్స్ తో చేసిన పొడిని రోజుకు రెండు పూట‌లా తీసుకోవ‌డం వ‌ల్ల డ‌యేరియా స‌మ‌స్య త‌గ్గు ముఖం ప‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా శ‌రీరంలో క్యాన్స‌ర్ క‌ణాల విభ‌జ‌న‌ను అరిక‌ట్టి క్యాన్స‌ర్ వ్యాప్తిని త‌గ్గించ‌డంలో ఈ దిల్ సీడ్స్ ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయని కూడా నిపుణులు ప‌రిశోధ‌న‌ల ద్వారా వెల్ల‌డించారు. ఈ విధంగా దిల్ సీడ్స్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు సూచిస్తున్నారు.

D

Recent Posts