నల్ల నువ్వులు.. వీటిని భారతీయ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇవి వంటలకు చక్కని రుచిని అందిస్తాయి. వీటిల్లో మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ క్రమంలోనే నల్ల నువ్వుల వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం చాలా మంది హైబీపీ సమస్యతో బాధపడుతున్నారు. నల్ల నువ్వుల్లో మెగ్నిషియం అధికంగా ఉంటుంది. ఇది హైబీపీని తగ్గిస్తుంది. ఈ నువ్వుల్లో పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్, సెసామిన్ అనే సమ్మేళనం ఉంటాయి. ఇవి బీపీని నియంత్రిస్తాయి. అందువల్ల హైబీపీ తగ్గుతుంది.
2. జీర్ణ సమస్యలను తగ్గించడంలో నల్ల నువ్వులు బాగా పనిచేస్తాయి. వీటిల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని తగ్గిస్తుంది. పేగుల కదలికలను సరి చేస్తుంది. దీంతో జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.
3. నల్ల నువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో కెమికల్స్ అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కు కారణం అయ్యే కణాల నుంచి మనకు రక్షణను అందిస్తాయి. ఈ నువ్వుల్లో ఉండే సెసామిన్ అనే సమ్మేళనం ఫ్రీ ర్యాడికల్స్ ను నాశనం చేస్తుంది. దీని వల్ల క్యాన్సర్లు రాకుండా నివారించవచ్చు.
4. నల్ల నువ్వుల్లో కాల్షియం, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. నల్ల నువ్వులను తినడం వల్ల శరీరంలో సెరొటోనిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తుంది. ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది. నిద్ర చక్కగా పట్టేలా చేస్తుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. నొప్పులు తగ్గుతాయి.
5. నల్ల నువ్వుల్లో ఉండే మెగ్నిషియం శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి, ముఖ్యంగా ఆస్తమా రోగులకు ఎంతగానో మేలు చేస్తుంది. అందువల్ల వారు నల్ల నువ్వులను రోజూ తినాలి.
6. ఈ నువ్వుల్లో కాల్షియం, జింక్ అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయ.
7. నల్ల నువ్వుల్లో ఉండే పోషకాలు కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తాయి. ఈ నువ్వులను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు. దీంతో గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు.
8. పాలిచ్చే తల్లులు నల్ల నువ్వులను తినడం వల్ల వారిలో పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. ఈ నువ్వుల్లో బి విటమిన్లు, ఐరన్ ఉంటాయి. ఇవి చర్మాన్ని యవ్వనంగా, అందంగా మారుస్తాయి. రక్తహీనతను తగ్గిస్తాయి.
నల్ల నువ్వులను నేరుగా తినవచ్చు. కాకపోతే వాటిని కొద్దిగా పెనంపై వేయిస్తే బాగుంటాయి. వాటిని గుప్పెడు మోతాదులో స్నాక్స్ రూపంలో తినాలి. లేదా వాటి పొడిని ఆహారాలపై చల్లి తీసుకోవచ్చు. దీంతో ప్రయోజనాలను పొందవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365