మనకు పోషకాలను అందించే అనేక రకాల ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో సీడ్స్.. అంటే.. విత్తనాలు కూడా ఉన్నాయి. వీటిల్లో అనేక రకాల విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అందువల్ల విత్తనాలను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటితో పోషణ మాత్రమే కాదు, మన శరీరానికి శక్తి కూడా అందుతుంది.
విత్తనాల్లో ఫైబర్ (పీచు పదార్థం) పుష్కలంగా ఉంటుంది. ఇవి ఆరోగ్యకరమైన మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్‌ను కలిగి ఉంటాయి. అలాగే వీటిల్లో ఎన్నో ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల షుగర్ తగ్గుతుంది. కొలెస్ట్రాల్, బీపీలు నియంత్రణలో ఉంటాయి.
ఏయే విత్తాలను తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వీటిల్లో ఫైబర్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. అలాగే పాలిఫినాల్స్ అనబడే సమ్మేళనాలు కూడా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లలా పనిచేస్తాయి. యూనివర్సిటీ ఆఫ్ కోపెన్ హాగన్‌కు చెందిన సైంటిస్టులు తెలిపిన వివరాల ప్రకారం.. అవిసె గింజలు ఆకలిని నియంత్రించి అధిక బరువును తగ్గించేందుకు సహాయ పడతాయి. ఒక టీస్పూన్ అవిసె గింజలను తీసుకున్న చాలు పుష్కలంగా ఫైబర్ లభిస్తుంది. ఇవి బీపీని నియంత్రిస్తాయి. బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా చూస్తాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
అవిసె గింజలలాగే ఇవి కూడా అద్భుతమైన లాభాలను అందిస్తాయి. వీటిల్లోనూ ఫైబర్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఇతర పోషకాలు ఉంటాయి. వీటిల్లో పాలిఫినాల్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. చియా విత్తనాలను తినడం వల్ల శరీరంలో అల్ఫా-లినోలీనిక్ యాసిడ్ పెరుగుతుంది. దీంతో శరీరంలో వాపులు తగ్గుతాయి. ఒక అధ్యయనం ప్రకారం.. చియా విత్తనాలను తినడం వల్ల బ్లడ్ షుగర్ తగ్గుతుంది. ఆకలి నియంత్రణలో ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
వీటిని మన దేశంలో ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నారు. ఆసియాలోని అనేక దేశాల్లో వీటిని వాడుతారు. వీటిల్లో ఫైబర్, మెగ్నిషియం, మాంగనీస్, కాపర్, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్లు, మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్‌లు పుష్కలంగా ఉంటాయి. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం.. మెనోపాజ్ దశలో ఉన్న మహిళలు నిత్యం 50 గ్రాముల మోతాదులో నువ్వులను పొడి రూపంలో తీసుకుంటే 5 వారాల తరువాత వారిలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గినట్లు గుర్తించారు. అలాగే హార్మోన్ల సమస్యలు లేవని తేల్చారు. అందువల్ల మహిళలు వీటిని తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే అథ్లెట్లు, జిమ్, వ్యాయామం చేసేవారు వీటిని తీసుకోవడం వల్ల కండరాలు సురక్షితంగా ఉంటాయి.
వీటిల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరమంతటికీ వ్యాపిస్తుంది. దీంతో శరీరానికి హాని కలిగించే ఫ్రీ ర్యాడికల్స్ నాశనం అవుతాయి. పొద్దు తిరుగుడు విత్తనాల్లో మెగ్నిషియం కూడా పుష్కలంగానే ఉంటుంది. ఇది వాపులను, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. వీటిల్లో ఫోలేట్ అనే బి విటమిన్ ఉంటుంది. ఇది గర్బిణీలకు, గుండె జబ్బులు ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తుంది.