మనకు అందుబాటులో ఉన్న అత్యంత పోషక విలువలు కలిగిన పదార్థాల్లో వాల్ నట్స్ ఒకటి. వీటిల్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. మన శరీరానికి కావల్సిన దాదాపు అన్ని రకాల పోషకాలు వాల్ నట్స్ లో ఉంటాయి. రోజూ వాల్ నట్స్‌ను తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. వాల్ నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. విటమిన్ ఇ, మెలటోనిన్, పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి. దీని వల్ల శరీరంలోని చెడు (ఎల్‌డీఎల్) కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. హార్ట్ ఎటాక్ లు రాకుండా అడ్డుకోవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
2. వాల్ నట్స్ లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. 28 గ్రాముల వాల్ నట్స్ ను తీసుకుంటే 2.5 గ్రాముల ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లభిస్తాయి. దీంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. రోజూ వాల్ నట్స్‌ను తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని 10 శాతం వరకు తగ్గించవచ్చని సైంటిస్టుల అధ్యయనాల్లో వెల్లడైంది. కనుక రోజూ వాల్ నట్స్‌ను తీసుకోవాలి.
3. శరీరంలో వాపుల కారణంగా గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, అల్జీమర్స్, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి. అయితే వాల్‌నట్స్‌లో ఉండే పాలిఫినాల్స్ వాపులను తగ్గిస్తాయి. దీంతో ఆయా అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. వాల్ నట్స్ లోని మెగ్నిషియం కూడా వాపులను తగ్గిస్తుంది.
4. మన జీర్ణాశయంలో మంచి బాక్టీరియా కూడా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి దోహదపడుతుంది. అయితే వాల్ నట్స్ ను తినడం వల్ల మంచి బాక్టీరియా వృద్ది చెందుతుంది. దీంతో జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
5. వాల్ నట్స్ లో క్యాన్సర్‌ను అడ్డుకునే లక్షణాలు ఉంటాయని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది. వీటిని రోజూ తీసుకోవడం వల్ల పలు రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. ముఖ్యంగా బ్రెస్ట్, ప్రోస్టేట్, పెద్దపేగు క్యాన్సర్‌లు రాకుండా నిరోధించవచ్చు.
6. అధిక బరువు తగ్గాలనుకునేవారు రోజూ వాల్ నట్స్ ను తినాలి. రోజూ వాల్ నట్స్ ను తీసుకోవడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.
7. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు రోజూ వాల్ నట్స్ ను తినాలి. దీని వల్ల వారి రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. 3 నెలల పాటు 100 మంది పేషెంట్లకు రోజూ 1 టేబుల్ స్పూన్ వాల్ నట్ ఆయిల్‌ను ఇచ్చారు. దీంతో వారిలో షుగర్ లెవల్స్ 8 శాతం తగ్గినట్లు గుర్తించారు. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు వాల్ నట్స్ ను తినడం మేలు.
8. హైబీపీ సమస్యతో బాధపడేవారు రోజూ వాల్ నట్స్‌ను తినాలి. 7500 మందికి 4 ఏళ్ల పాటు రోజూ 28 గ్రాముల వాల్ నట్స్‌ను ఇచ్చారు. దీంతో వారిలో హైబీపీ నియంత్రణలోకి వచ్చినట్లు సైంటిస్టులు గుర్తించారు. అందువల్ల వాల్ నట్స్‌ను రోజూ తింటే మంచిది.
9. వాల్ నట్స్ లో మన శరీరానికి కావల్సిన విటమిన్లు, మినరల్స్, ఫైబర్, ఫ్యాట్స్, వృక్ష సంబంధ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి వయస్సు మీద పడడం వల్ల వచ్చే ముడతలను తగ్గిస్తాయి. దీంతో చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపిస్తుంది.
10. వాల్ నట్స్‌లో మెదడు పనితీరును మెరుగు పరిచే పోషకాలు ఉంటాయి. విటమిన్ ఇ, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్లు, పాలీఫినాల్స్ ఉంటాయి. దీని వల్ల మెదడుకు జరిగే నష్టాన్ని నివారించవచ్చు. వాపు తగ్గుతుంది. మెదడు పనితీరు మెరుగు పడుతుంది. యాక్టివ్‌గా మారుతారు. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి.
11. వాల్ నట్స్ ను రోజూ తినడం వల్ల పురుషుల్లో వీర్యం నాణ్యత పెరుగుతుంది. సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365