న‌ట్స్ & సీడ్స్

Phool Makhana : వీటిని తింటే శ‌రీరంలోని కొవ్వు మొత్తం క‌రుగుతుంది.. ఎముక‌లు బ‌లంగా త‌యార‌వుతాయి..!

Phool Makhana : మనం తామర పూల‌ను గుడి కోనేరులోనో లేదా పల్లెటూరు చెరువుల్లో ఎక్కువగా కూడా చూస్తూ ఉంటాం. తామర పువ్వు అందాన్ని చూస్తే అలానే చూసుకొని ఉండాలనిపిస్తుంది. ఇంత అందమైన తామర పువ్వుల్లో ఎన్ని ఔషధ‌ గుణాలు ఉంటాయో తెలిస్తే క‌చ్చితంగా ఆశ్చర్యపోతారు. తామర పువ్వుల‌లో రేకులు తీసేస్తే లోన శంకు ఆకారంలో ఒక పదార్థం ఉంటుంది. దాన్ని విడదీస్తే లోపల పొడుగాటి విత్తనాలు ఉంటాయి. భారతీయ వంటలలో ముఖ్యంగా ఉత్తరాది వాళ్లు ఎక్కువగా వంటల్లో వీటిని వాడుతారు. వీటినే పూల్ మఖనా అని అంటారు.

పూల్ మఖనాగా పిలవబడే ఈ తామర విత్తనాలకు ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత ఉంది. చైనీయులు కూడా తామర విత్తనాల‌ను ఎక్కువగా వాడుతారు. మనం సాధారణంగా తినే జీడిపప్పు, బాదం వంటి వాటికన్నా పూల్ మఖనాలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఏంటి ఈ తామర గింజలను పూల్ మఖనా అంటారా అని ఆశ్చర్యపోకండి. తామర పువ్వులో ఉండే ఈ గింజలనే ఒక మందపాటి పొడి కళాయిలో ఫ్రై చేస్తే పూల్ మఖనాగా తయారవుతాయి. ఇప్పుడు పూల్ మఖనాలో పోషక విలువలు, మనకు కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.

lotus seeds are best for bones health

100 గ్రాముల తామర గింజల‌లో 15 గ్రాముల‌ ప్రోటీన్స్, శక్తి 347 క్యాలరీలు, ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ 102 మిల్లీగ్రాములు, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ 1064 మిల్లీగ్రాములు, పొటాషియం 1368 మిల్లీగ్రాములు, ఫాస్పరస్ 626 మిల్లీగ్రాములు, ఫోలిక్ యాసిడ్ 104 మిల్లిగ్రాములు, మెగ్నీషియం 210 మిల్లీగ్రాములు.. త‌దిత‌ర‌ పోషకాలు లభిస్తాయి.

బరువు తగ్గాలనుకునేవారికి పూల్ మఖనా మంచి ఛాయిస్. ఎందుకంటే వీటిలో అధికశాతం ప్రోటీన్స్, ఫైబర్ ఉండటం వల్ల బరువును అదుపులో ఉంచి రక్తంలోని కొవ్వు, గ్లూకోజ్ శాతాన్ని తగ్గిస్తాయి. పూల్ మఖనాలో మంచి కొవ్వులు ఉండటం వల్ల బరువు పెరుగుతామనే భయం ఉండదు. పూల్ మఖనాను తినటం వలన కడుపు నిండుగా ఉండే భావన వలన వెంటనే ఆకలి వేయదు. శరీరంలో నరాల పనితీరుకి న్యూరో ట్రాన్సమిషన్ చాలా ముఖ్యమైనది. తామర విత్తనాలు ఎసిటైల్‌కోలిన్‌ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతాయి. తద్వారా న్యూరోట్రాన్స్‌మిషన్ ప్రక్రియకు దోహదం చేస్తుంది. అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారికి కూడా రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. అందువ‌ల్ల వీటిని త‌ర‌చూ తింటే ఎన్నో లాభాలు పొంద‌వ‌చ్చు.

Admin

Recent Posts