Macadamia Nuts : రోజు ఒక్క‌టి తింటే చాలు.. జెట్ వేగంతో కండ పెరుగుతుంది.. షుగ‌ర్ త‌గ్గుతుంది..!

Macadamia Nuts : ప్ర‌కృతి మ‌న‌కు ఎన్నో ర‌కాల డ్రై ఫ్రూట్స్ ను అందించింద‌ని మ‌నంద‌రికి తెలిసిందే. ప్ర‌కృతి అందించిన డ్రై ఫ్రూట్స్ లో అత్యంత విలువైన డ్రై ఫ్రూట్ గురించి మ‌నం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ డ్రై ఫ్రూట్ మ‌రేమిటో కాదు అదే మ‌కాడేమియా. ఇది మ‌న‌కు పెద్ద పెద్ద డ్రై ఫ్రూట్ షాపుల్లో మాత్ర‌మే ల‌భిస్తుంది. దీనిని గురించి దాదాపు మ‌న‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు. ఈ మ‌కాడేమియా డ్రై ఫ్రూట్ కిలో నాలుగు వేల రూపాయ‌లు ఉంటుంది. ఇది ఎక్కువ‌గా చైనా దేశంలో పండుతుంది. ఈ గింజ‌లు అతి మ‌ధురంగా, అతి రుచిగా ఉంటాయి. ఈ గింజ‌ల‌పై పెంకు చాలా గ‌ట్టిగా ఉంటుంది. పెంకు తీసేసిన గింజ‌లు, పెంకుతో ఉండే గింజ‌లు ఇలా రెండు ర‌కాలుగా మ‌న‌కు ల‌భిస్తాయి. మ‌కాడేమియా గింజ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే లాభాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ గింజ‌ల‌ను తిన‌డం వ‌ల్ల 713 క్యాల‌రీల శ‌క్తి లభిస్తుంది. బాదంప‌ప్పు, జీడిప‌ప్పు, వాల్ న‌ట్స్ కంటే ఈ గింజ‌లు అధిక క్యాల‌రీల శ‌క్తిని క‌లిగి ఉంటాయి. అలాగే 66 గ్రాముల ఫ్యాట్ ను క‌లిగి ఉంటుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. అలాగే ఈ గింజ‌ల్లో 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ 13 గ్రాముల మోతాదులో ఉంటాయి. డ‌యాబెటిస్ తో బాధ‌ప‌డే వారు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. షుగ‌ర్ పెర‌గ‌కుండా ఉండ‌డంతో పాటు శ‌రీరానికి కావ‌ల్సిన శ‌క్తి కూడా ల‌భిస్తుంది. అలాగే ఈ గింజ‌ల్లో 9 గ్రాముల ఫైబ‌ర్ ఉంటుంది. వీటిని కొనుగోలు చేసే స్థితిలో ఉన్న వారు వీటిని తీసుకోవ‌చ్చు. ఈ గింజ‌ల‌ను నాన‌బెట్టాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.

Macadamia Nuts in telugu health benefits of them
Macadamia Nuts

తాజాగా తింటేనే చాలా రుచిగా ఉంటాయి. మొలకెత్తిన విత్త‌నాల‌తో క‌లిపి తీసుకోవ‌చ్చు అలాగే సాయంత్రం స‌మ‌యాల్లో వీటిని స్నాక్స్ గా కూడా తీసుకోవ‌చ్చు. త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ బ‌రువు పెర‌గాల‌నుకునే వారు, గ‌ర్భిణీ స్త్రీలు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా బ‌రువు పెర‌గ‌వ‌చ్చు. జీర్ణ స‌మస్య‌లు ఉన్న వారు వీటిని నాన‌బెట్టి తీసుకోవ‌చ్చు. ఈ గింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ‌రీరంలోజీవ‌క్రియల రేటు పెరుగుతుంది. దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మస్య‌ల బారిన ప‌డే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి. ఈ మ‌కాడేమియా గింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని ఇవి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts