Pistachios : మనం అనేక రకాల డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో పిస్తా పప్పు ఒకటి. పిస్తా పప్పు మనందరికి తెలిసిందే. పిస్తా పప్పు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. పిస్తా పప్పును ఆహారంగా తీసుకోవడం వల్ల మన చక్కటి ఆరోగ్యాన్ని, అందాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పిస్తా పప్పులో శరీరంలో మేలు చేసే కొవ్వులు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు వంటి పోషకాలు అనేకం ఉంటాయి. పిస్తా పప్పును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గుండె ఆరోగ్యానికి పిస్తా పప్పు ఎంతో మేలు చేస్తుంది. దీనిని తినడం వల్ల శరీరంలో చెడు కొవ్వు స్థాయిలు తగ్గి మంచి కొవ్వు స్థాయి పెరుగుతుంది. దీనిని తరచూ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు మన దరి చేరకుండా ఉంటాయి. అలాగే కంటి సమస్యలతో బాధపడే వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతుంది. కంటి చూపు మందగించడం వంటి సమస్యతో బాధపడే వారు పిస్తాను తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. కంటికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే మన జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో కూడా పిస్తా పప్పు మనకు ఉపయోగపడుతుంది.
దీనిలో ఉండే ఫైబర్ జీర్ణసమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే పిస్తా యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. కనుక వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరగకుండా ఉంటాయి. షుగర్ వ్యాధి గ్రస్తులు పిస్తా పప్పును తగిన మోతాదులో తీసుకోవడం వల్ల ఎటువంటి హాని కలగకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే పిస్తా పప్పు మనకు మల్టీ విటమిన్ క్యాప్సుల్ లాగా పని చేస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ ను వేసుకుంటే ఎంత ప్రయోజనం కలుగుతుందో పిస్తా పప్పును తింటే కూడా అంతే ప్రయోజనం కలుగుతుందని వారు చెబుతున్నారు. అలాగే పిస్తా పప్పు బరువును తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తుంది.
కనుక అధిక బరువు సమస్యతో బాధపడే వారు ఈ పిస్తా పప్పును తినడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. అదే విధంగా పిస్తా పప్పును తినడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. పిస్తా పప్పును తీసుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి. ఈ విధంగా పిస్తా పప్పు మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని వీటిని రోజూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.