పుచ్చకాయ విత్తనాలను తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలివే..!

సాధారణంగా ఎవరైనా సరే పుచ్చకాయలను తినేటప్పుడు కేవలం కండను మాత్రమే తిని విత్తనాలను తీసేస్తుంటారు. అయితే నిజానికి పుచ్చకాయ విత్తనాలు కూడా మనకు ఎంతగానో మేలు చేస్తాయి. వాటిని తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. అయితే వాటిని నేరుగా తినలేమని అనుకునే వారు వాటిని ఎంచక్కా రోస్ట్‌ చేసి తినవచ్చు. దీంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

puchakaya seeds uses in telugu

మెగ్నిషియం…

పుచ్చకాయ విత్తనాల్లో అనేక మినరల్స్‌ ఉంటాయి. వాటిల్లో మెగ్నిషియం కూడా ఒకటి. 4 గ్రాముల విత్తనాల ద్వారా మనకు 21 మిల్లీగ్రాముల మెగ్నిషియం లభిస్తుంది. అంటే రోజులో కావల్సిన దాంట్లో 5 శాతం మెగ్నిషియం అన్నమాట. ఈ క్రమంలో మెగ్నిషియం వల్ల మన శరీరంలో జీవరసాయన ప్రక్రియలు సరిగ్గా నిర్వహించబడతాయి. అలాగే కండరాలు పనితీరు మెరుగు పడుతుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఎముకలు దృఢంగా మారుతాయి.

ఐరన్‌…

నిత్యం గుప్పెడు పుచ్చకాయ విత్తనాలను తినడం ద్వారా మనకు 0.29 మిల్లీగ్రాముల ఐరన్‌ లభిస్తుంది. నిత్యం మనకు కావల్సిన ఐరన్‌లో ఇది 1.6 శాతం. అందువల్ల ఈ విత్తనాలతో మన శరీరంలో హిమోగ్లోబిన్‌, రక్తం బాగా ఉత్పత్తి అవుతాయి. రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.

ఆరోగ్యకరమైన కొవ్వులు…

పుచ్చకాయ విత్తనాల్లో మన శరీరానికి కావల్సిన ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. మోనో అన్‌శాచురేటెడ్‌, పాలీ అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్లని వాటిని పిలుస్తారు. అవి మనకు ఈ విత్తనాల ద్వారా లభిస్తాయి. దీంతో హార్ట్‌ ఎటాక్‌, స్ట్రోక్‌ రాకుండా ఉంటాయి. రక్తంలో ఉండే కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గుతాయి.

జింక్‌…

పుచ్చకాయ విత్తనాల్లో జింక్‌ కూడా పుష్కలంగానే ఉంటుంది. ఒక గుప్పెడు పుచ్చకాయ విత్తనాలను నిత్యం తింటే మనకు నిత్యం కావల్సిన జింక్‌లో దాదాపుగా 26 శాతం జింక్‌ అందుతుంది. దీంతో శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నాడీ మండల వ్యవస్థ, జీర్ణ వ్యవస్థల పనితీరు మెరుగుపడుతుంది. కణాలు నిర్మాణం అవుతాయి. రుచి, వాసనలను గుర్తించే సామర్థ్యం పెరుగుతుంది.

అయితే పుచ్చకాయ విత్తనాలను సుమారుగా 15 నిమిషాల పాటు రోస్ట్‌ చేయాల్సి ఉంటుంది. దీంతో వాటి రుచిని ఆస్వాదించవచ్చు. రోస్ట్‌ చేసిన విత్తనాలను నేరుగా తినవచ్చు. లేదా ఇతర ఆహారాలతో కలిపి తీసుకోవచ్చు.

Admin

Recent Posts