Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home పోష‌కాహారం న‌ట్స్ & సీడ్స్

Sesame Seeds For Bones : వీటిని తింటే కీళ్ల‌లో గుజ్జు పెరుగుతుంది.. ఎలాంటి నొప్పులు ఉండ‌వు..

D by D
January 17, 2023
in న‌ట్స్ & సీడ్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Sesame Seeds For Bones : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, ఆర్థ రైటిస్ వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. పెద్ద వారే కాకుండా యువ‌త‌, న‌డివ‌య‌స్కులు కూడా ఈ స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌డం మ‌న‌ల్ని మ‌రింత ఆందోళ‌న‌కు గురి చేస్తుంది. అధిక బ‌రువు, క్యాల్షియం లోపించ‌డం, పోష‌కాలు లోపించ‌డం, ఎక్కువ సేపు క‌ద‌ల‌కుండా కూర్చోవ‌డం, శ‌రీరానికి త‌గినంత వ్యాయ‌మం లేక‌పోవ‌డం వంటి అనేక కార‌ణాల చేత కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. ఈ స‌మ‌స్య ల నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి చాలా మంది పెయిన్ కిల్ల‌ర్స్ ను, నొప్పిని త‌గ్గించే ఆయింట్ మెంట్ ల‌ను ఉప‌యోగిస్తూ ఉంటారు. వీటి వ‌ల్ల తాత్కాలిక ఉప‌శ‌మ‌నం మాత్ర‌మే క‌లుగుతుంది. స‌హ‌జ సిద్దంగా కూడా మ‌నం ఈ స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు నువ్వుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. క్యాల్షియం అధికంగా ఉండే ఆహారాల్లో నువ్వులు మొద‌టి స్థానంలో నిలుస్తాయి. నువ్వుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి త‌గినంత క్యాల్షియం అందుతుంది. నువ్వుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మోకాళ్ల‌ల్లో ఉండే ఇన్ ప్లామేష‌న్ త‌గ్గ‌డంతో పాటు ప్రారంభ ద‌శ‌లో ఉన్న నొప్పులు కూడా త‌గ్గుతాయని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. కీళ్ల మ‌ధ్య‌, మోకాళ్ల మ‌ధ్య ఇన్ఫెక్ష‌న్ కార‌ణంగా కార్టిలైజ్ దెబ్బ‌తింటుంది. దీంతో జిగురు ఉత్ప‌త్తి చేసే పొర‌లు దెబ్బ‌తింటాయి. జిగురు ఎక్కువ‌గా ఉత్ప‌త్తి కాక‌పోయినా, కార్టిలైజ్ దెబ్బ‌తిన్నా కూడా నొప్పులు ఎక్కువవుతాయి.

Sesame Seeds For Bones take regularly to get maximum benefits
Sesame Seeds For Bones

కీళ్ల నొప్పుల‌కు కార‌ణ‌మ‌య్యే ఈ ఇన్ ప్లామేష‌న్, ఇన్ఫెక్ష‌న్ ను త‌గ్గించ‌డంలో నువ్వులు అధ్భుతంగా ప‌ని చేస్తాయని శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోధ‌న‌ల ద్వారా తెలియ‌జేస్తున్నారు. రోజుకు 10 నుండి 15 గ్రాముల నువ్వులను నెల‌రోజుల పాటు ఏ రూపంలో తీసుకున్నా కూడా 51 శాతం నొప్పులు త‌గ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఆస్ట్రియో పోరోసిస్, ఆస్ట్రియో ఆర్థ‌రైటిస్, రుమాటాయిడ్ ఆర్థ‌రైటిస్, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు నువ్వులను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అలాగే నువ్వుల్లో సెసామిన్ అనే ర‌సాయ‌న స‌మ్మేళ‌నం ఉంటుంది.

ఇది కార్టిలైజ్ దెబ్బ‌తిన‌కుండా నిరోధించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. 100 గ్రాముల నువ్వుల్లో 1450 మిల్లీ గ్రాముల క్యాల్షియం ఉంటుంది. ఈ క్యాల్షియం ఎముక‌లు గుళ్ల‌బార‌కుండా, ఎముక‌లు గ‌ట్టిగా ఉండేలా చేయ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. ఈ విధంగా మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, ఆర్థ‌రైటిస్ వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు నువ్వుల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Tags: Sesame Seeds For Bones
Previous Post

Egg Breakfast : కోడిగుడ్ల‌తో ఎంతో రుచిక‌ర‌మైన బ్రేక్‌ఫాస్ట్‌ను ఇలా చేయ‌వ‌చ్చు..!

Next Post

Pesarakattu Charu : పెస‌ర‌క‌ట్టుతో చారును ఇలా చేస్తే.. నోట్లో నీళ్లూర‌డం ఖాయం..

Related Posts

lifestyle

తొడ‌లు లావుగా ఉన్న‌వారు ఇలాంటి దుస్తుల‌ను ధ‌రిస్తే మంచిది..!

June 3, 2025
హెల్త్ టిప్స్

పాదాల వాపులు ఉన్నాయా.. అయితే ఇలా చేయండి చాలు..

June 3, 2025
వైద్య విజ్ఞానం

ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే అది డీహైడ్రేష‌న్ అన్న‌మాటే.. ఇలా చేస్తే చాలు..!

June 3, 2025
mythology

మంగ‌ళ సూత్రాల‌కు పిన్నీసుల‌ను ఎందుకు పెట్ట‌కూడ‌దు..?

June 2, 2025
ఆధ్యాత్మికం

చిన్న వ‌య‌స్సులోనే పిల్ల‌లు చ‌నిపోతే.. అందుకు కార‌ణం ఎవ‌రు..?

June 2, 2025
ఆధ్యాత్మికం

పూజ చేసిన త‌రువాత క‌ర్పూరం ఎందుకు వెలిగిస్తారు..? దీని వెనుక ఉన్న సైన్స్ ఇదే..!

June 2, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!