నట్స్, సీడ్స్‌ను తీసుకోవడం వల్ల శరీరానికి పోషకాలు అందడమే కాక శక్తి లభిస్తుంది. వాటి వల్ల మనం అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటాం. ఇక సీడ్స్ విషయానికి వస్తే చియా సీడ్స్ మనకు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. మెటబాలిజం మెరుగు పడుతుంది. ఐరన్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లభిస్తాయి. అందువల్ల చియా సీడ్స్ ను ఆహారంలో భాగం చేసుకోవాలి.
అధిక బరువును తగ్గించుకునేందుకు, పొట్ట దగ్గరి కొవ్వును కరిగించేందుకు చియా సీడ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. 100 గ్రాముల చియా సీడ్స్‌లో 16.5 గ్రాముల ప్రోటీన్లు, 34.4 గ్రాముల ఫైబర్, 7.7 మిల్లీగ్రాముల ఐరన్, 335 మిల్లీగ్రాముల మెగ్నిషియం ఉంటాయి. అలాగే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా లభిస్తాయి.
చియా విత్తనాలను నీటిలో నానబెట్టి తినాల్సి ఉంటుంది. చియా విత్తనాల్లో ఉండే ఫైబర్ మన శరీరంలోని కొవ్వును కరిగించేందుకు సహాయ పడుతుంది. అందుకు గాను ఆ విత్తనాలను రోజూ నానబెట్టి తినాల్సి ఉంటుంది. కేవలం 2 టేబుల్ స్పూన్ల చియా సీడ్స్ ను తింటే చాలు మనకు 10 గ్రాముల మేర ఫైబర్ లభిస్తుంది. అందువల్ల బరువు తగ్గడం సులభతరం అవుతుంది.
ప్రోటీన్లు కావాలంటే మాంసాహారమే తినాల్సిన పనిలేదు. రోజూ చియా విత్తనాలను తింటే చాలు, వృక్ష సంబంధ ప్రోటీన్లు లభిస్తాయి. యురోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురించిన వివరాల ప్రకారం.. చియా విత్తనాలను తినడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీని వల్ల అధికంగా ఆహారం తీసుకోకుండా జాగ్రత్త పడవచ్చు. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.
చియా సీడ్స్ లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతుంది. కొవ్వును కరిగిస్తుంది. ఈ విత్తనాల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్ ను నాశనం చేసి కణాలను రక్షిస్తాయి. దీని వల్ల హార్ట్ ఎటాక్ లు రాకుండా చూసుకోవచ్చు.
రోజూ రాత్రి గుప్పెడు చియా సీడ్స్ ను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్‌లో తీసుకోవాలి. దీని వల్ల పైన తెలిపిన ప్రయోజనాలు కలుగుతాయి.