Cooling Seeds : ఈ గింజ‌ల‌ను రోజూ తినండి.. వేస‌వి, ఎండ‌ను త‌రిమికొట్టండి..!

Cooling Seeds : వేస‌విలో శ‌రీరంలో త‌గినంత నీరు ఉండేలా చూసుకోవ‌డం అలాగే శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచుకోవ‌డం చాలా అవ‌స‌రం. శ‌రీరరాన్ని చ‌ల్ల‌గా ఉంచుకోవ‌డానికి నీటిని తాగ‌డంతో పాటు కొన్ని ర‌కాల విత్త‌నాల‌ను మ‌న ఆహారంలో చేర్చుకోవ‌డం వ‌ల్ల శ‌రీరాన్ని ఎల్ల‌ప్పుడు చ‌ల్ల‌గా ఉంచుకోవ‌చ్చు అలాగే ఈ విత్త‌నాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల వ‌డ‌దెబ్బ బారిన ప‌డ‌కుండా ఉంటాము. అంతేకాకుండా ఈ విత్త‌నాల‌ల్లో అనేక ర‌కాల విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ తో పాటు అనేక ర‌కాల పోష‌కాలు కూడా ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరం చ‌ల్ల‌బ‌డ‌డంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రిచే విత్త‌నాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచే విత్త‌నాల్లో సోంపు గింజ‌లు కూడా ఒక‌టి. వీటిలో ఉండే ర‌సాయ‌న స‌మ్మేళ‌నాలు శ‌రీరంలో వేడిని తగ్గించి శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌ర‌చ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. ఈ గింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణశ‌క్తి మెరుగుప‌డుతుంది. క‌డుపు ఉబ్బ‌రం, క‌డుపులో నొప్పి వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

వీటిని వంట‌ల్లో వాడ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెర‌గ‌డంతో పాటు శ‌రీరం కూడా చ‌ల్ల‌గా ఉంటుంది. శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు కూడా అందుతాయి. అలాగే చియా విత్త‌నాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌న శ‌రీరం చ‌ల్ల‌బ‌డుతుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరం నీటి స్థాయిలు అదుపులో ఉంటాయి. దీంతో శ‌రీరం చ‌ల్ల‌గా ఉంటుంది. అంతేకాకుండా వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉండే ఇన్ ప్లామేష‌న్ త‌గ్గుతుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఎండ వ‌ల్ల శ‌రీరం కోల్పోయిన పోష‌కాలు తిరిగి ల‌భిస్తాయి. అదే విధంగా శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌ర‌చ‌డంలో అవిసె గింజ‌లు కూడా మ‌న‌కు తోడ్ప‌డ‌తాయి. వీటిలో ఉండే ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఎండ వ‌ల్ల క‌లిగే ఒత్తిడిని త‌గ్గించి శ‌రీరం చ‌ల్ల‌గా ఉండేలా చేయ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. అవిసె గింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఎండ వ‌ల్ల క‌లిగే నీర‌సం నుండి మ‌న‌ల్ని మ‌నం కాపాడుకోవ‌చ్చు. అలాగే జీల‌క‌ర్ర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా శ‌రీరం చ‌ల్ల‌గా ఉంటుంది. దీనిలో ఉండే వివిధ ర‌కాల నూనెలు శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచ‌డంలో దోహ‌ద‌ప‌డ‌తాయి.

take these Cooling Seeds in summer for better health
Cooling Seeds

అలాగే ఎండ వ‌ల్ల శ‌రీరంలో జీర్ణ‌శ‌క్తి మంద‌గిస్తుంది. క‌నుక జీల‌క‌ర్ర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరం చ‌ల్ల‌గా ఉండ‌డంతో పాటు జీర్ణ‌శ‌క్తి కూడా మెరుగుప‌డుతుంది. అదే విధంగా వేస‌వికాలంలో గ‌స‌గ‌సాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. వీటిలో ఆల్క‌లాయిడ్స్ శ‌రీరంలో ఉండే ఉష్ణోగ్ర‌త‌ను, ఇన్ ప్లామేష‌న్ ను త‌గ్గించి శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. అంతేకాకుండా గ‌స‌గ‌సాల్లో అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. అలాగే ధ‌నియాల‌ను, మెంతుల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల కూడా శ‌రీరం చ‌ల్ల‌గా ఉంటుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. ఈ విధంగా ఈ విత్తనాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉండే వేడి త‌గ్గి శ‌రీరం చ‌ల్ల‌గా ఉంటుంది. ఎండ వ‌ల్ల శ‌రీరం కోల్పోయిన పోష‌కాలు తిరిగి అందుతాయి. ఎండ వ‌ల్ల నీర‌సానికి గురి అవ్వ‌కుండా ఉంటాము. వేస‌వికాలంలో ఈ విత్త‌నాల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొందవ‌చ్చు.

Share
D

Recent Posts