Cashews : మనందరం జీడిపప్పును ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాము. తీపి పదార్థాల తయారీలో వాడడంతో పాటు వీటిని నానబెట్టి కూడా చాలా మంది తీసుకుంటూ ఉంటారు. జీడిపప్పు చాలా రుచిగా ఉంటుంది. దీనిని తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. జీడిపప్పులో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. అయితే జీడిపప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేదే అయినప్పటికి దీనిని తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. అధికంగా జీడిపప్పును తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే మూత్రపిండాల్లో రాళ్ల సమస్య తలెత్తే అవకాశం కూడా ఉంది. అలాగే అలర్జీలు, కడుపు ఉబ్బరం, కీళ్లల్లో వాపులు రావడం వంటి సమస్యల బారిన కూడా పడవచ్చు.
కనుక మనం జీడిపప్పును తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఏది ఏమైనప్పటికి కొందరు జీడిపప్పుకు ప్రత్యామ్నాయ ఆహారాలను తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. జీడిపప్పుకు ప్రత్యామ్నాయ నట్స్ కూడా ఉంటాయి. జీడిపప్పుకు బదులుగా ఇతర నట్స్ ను తీసుకోవాలనుకునే వారు ఈ నట్స్ ను తీసుకోవచ్చు. జీడిపప్పుకు బదులుగా మనం పిస్తా పప్పును తీసుకోవచ్చు. పిస్తాపప్పు చాలా రుచిగా ఉంటుంది. ఇది కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పిస్తాపప్పును తీసుకోవడం వల్ల పోషకాహార లోపం తలెత్తకుండా ఉంటుంది. వీటిలో ప్రోటీన్స్ తో పాటు 9 రకాల ఆమైనో యాసిడ్లు కూడా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. చర్మం మురియు జుట్టు ఆరోగ్యవంతంగా ఉంటుంది.
అలాగే మనం జీడిపప్పుకు బదులుగా బాదంపప్పును కూడా తీసుకోవచ్చు. బాదంపప్పు కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల మనం ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఎముకలను ధృడంగా ఉంచడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, శరీరానికి కావల్సిన పోషకాలను అందించడంలో, క్యాన్సర్ వంటి ప్రాణాంతక అనారోగ్య సమస్యల బారిన పడకుండా చేయడంలో ఇలా అనేక రకాలుగా బాదంపప్పు మనకు సహాయపడుతుంది. అలాగే వాల్ నట్స్ ను తీసుకోవడం వల్ల కూడా మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా అధికంగా ఉంటాయి.
వాల్ నట్స్ ను తీసుకోవడం వల్ల కూడా మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇక మనం జీడిపప్పుకు బదులుగా తీసుకోదగిన డ్రై నట్స్ లలో ఫైన్ నట్స్ కూడా ఒకటి. ఇవి జీడిపప్పుకు చక్కటి ప్రత్యామ్నాయ నట్స్ అని చెప్పవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. అలాగే బరువు తగ్గడంలో, రక్తపోటును అదుపులో ఉంచడంలో, కడుపులో అల్సర్లను తగ్గించడంలో ఇలా అనేక రకాలుగా ఫైన్ నట్స్ మనకు సహాయపడతాయి. అదే విధంగా హెజెల్స్ నట్స్ ను కూడా మనం జీడిపప్పుకు ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. హెజెల్ నట్స్ లో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.
ఇవి దాదాపు జీడిపప్పు వంటి రుచిని కలిగి ఉంటాయి. చాక్లెట్ల తయారీలో వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ నట్స్ ను తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. జీడిపప్పుకు బదులుగా ఇతర నట్స్ ను తీసుకోవాలనుకునే వారు పైన చెప్పిన ఈ డ్రైనట్స్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు లభించడంతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.