Nuts : మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అవసరమవుతాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి తగినన్ని పోషకాలను అందించడం చాలా అవసరం. శరీరానికి తగినన్ని పోషకాలను అందాలంటే డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవాలని చాలా మంది చెబుతూ ఉంటారు. డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సి పోషకాలన్నీ అందుతాయి. వీటిని తినడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. అయితే నేటి కాలంలో డ్రై ఫ్రూట్స్ ధరలు ఎంతగా పెరిగిపోయాయో మనందరికి తెలిసిందే. పేద, మధ్య తరగతి వాళ్లకి ఇవి అందన్నంత దూరంలో ఉన్నాయి. కనుక వీటిని చాలా మంది కొనుగోలు చేసి తినలేరు. చాలా మంది డ్రై ఫ్రూట్స్ లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి అనుకుంటూ ఉంటారు. కానీ డ్రై ఫ్రూట్స్ కంటే ఎక్కవ పోషకాలను కలిగి ఉండే ఇతర ఆహారాలు కూడా ఉంటాయి. అలాగే ఇవి మనకు తక్కువ ధరలోనూ లభిస్తాయి.
తక్కువ ధరలో లభించడంతో పాటు ఎక్కువ పోషకాలను కలిగి ఉండే ఈ ఆహారాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. తక్కువ ధరలో ఎక్కువ పోషకాలను అందించే ఆహారాల్లో పల్లీలు కూడా ఒకటి. ఇవి ప్రతి ఒక్కరి వంటగదిలో ఉంటాయి. పల్లీలల్లో బాదం పప్పు కంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి. మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి3, నైట్రిక్ యాసిడ్ వంటి పోషకాలు ఎన్నో ఉంటాయి. ప్రతిరోజూ ఒక గుప్పెడు పల్లీలను నీటిలో నానబెట్టి తీసుకోవడం ఉదయం పూట తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ విధంగా పల్లీలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గాల్ బ్లాండర్ లో రాళ్ల సమస్యల తగ్గు ముఖం పడుతుంది. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గు ముఖం పడతాయి.
గర్భిణీ స్త్రీలు వీటిని తీసుకోవడం వల్ల గర్భస్థ శిశువు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే వీటిని ప్రతిరోజూ ఒక గుప్పెడు మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికి వీటిని ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. అలాగే పోషకాలను కలిగి ఉండే ఇతర ఆహారాల్లో నల్ల శనగలు కూడా ఒకటి. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే అన్ని రకాల పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల గుంగె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గర్భిణీ స్త్రీలకు అవసరమయ్యే ఫోలిక్ యాసిడ్ ఇందులో పుష్కలంగా ఉంటుంది. అలాగే వీటిలో ప్రోటీన్స్, ఫైబర్ కూడా అధిక మొత్తంలో ఉంటుంది. ఈ శనగలను గుప్పెడు మోతాదులో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఉడికించి తీసుకోవాలి. అంతేకాకుండా వీటిని మనం మొలకెత్తించి కూడా గుప్పెడు మోతాదులో తీసుకోవచ్చు. అలాగే మాంసం, పాలు, డ్రై ఫ్రూట్స్ కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉండూ ఆహారాల్లో సోయా బీన్స్ కూడా ఒకటి.
100 గ్రాముల సోయా బీన్స్ లో 16 గ్రాముల ప్రోటీన్, 6 గ్రాముల ఫైబర్, 4 గ్రాముల ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు లభిస్తాయి. గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు ఇవి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెద్ద ప్రేగు క్యాన్సర్ మన దరి చేరకుండా ఉంటుంది. మూత్రపిండాల సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అలాగే పోషకాలను ఎక్కువగా కలిగి ఉండే ఇతర ఆహారాల్లో ఎండు ద్రాక్ష కూడా ఒకటి. వీటిని రోజుకు 10 నుండి 15 చొప్పున తీసుకోవాలి. రాత్రి పడుకునే ముందు నీటిలో నానబెట్టి ఉదయాన్నే వీటిని తీసుకోవాలి. ఈ ఎండు ద్రాక్షలను తిని నీటిని తాగాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే మలినాలు, విష పదార్థాలు తొలగిపోయి శరీరం శుభ్రపడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.
రక్తహీనత సమస్య తగ్గుతుంది. మూత్రపిండాల్లో రాళ్ల సమస్య తగ్గుతుంది. ఇక తక్కువ ధరలో ఎక్కువ పోషకాలను కలిగి ఉండే ఆహారాల్లో ఖర్జూర పండు కూడా ఒకటి. వీటిని తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. శరీరానికి అవసరమయ్యే పోషకాలన్నీ లభిస్తాయి. ఎముకలు ధృడంగా తయారవుతాయి. ప్రతిరోజూ 2 ఖర్జూరాలను తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ వంటి వ్యాధులు మన దరి చేరకుండా ఉంటాయి. ఈ విధంగా ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. వీటిలో బాదంపప్పు, జీడిపప్పు కంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల తక్కువ ధరలో ఎక్కువ పోషకాలను శరీరానికి అందించవచ్చు.