Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home ఆరోగ్యం

డెంగ్యూ జ్వ‌రం వ‌చ్చి ప్లేట్‌లెట్లు బాగా త‌గ్గుతున్న వారు.. ఈ 10 అద్భుత‌మైన ఆహారాల‌ను తింటే ప్లేట్‌లెట్లు పెరుగుతాయి..!

Admin by Admin
August 26, 2021
in ఆరోగ్యం, పోష‌కాహారం
Share on FacebookShare on Twitter

డెంగ్యూ జ్వ‌రం వచ్చిన వారికి స‌హ‌జంగానే రోజూ ప్లేట్‌లెట్లు ప‌డిపోతుంటాయి. అందువ‌ల్ల రోజుల త‌ర‌బ‌డి త‌గ్గ‌ని జ్వ‌రం ఉంటే వెంట‌నే ప్లేట్‌లెట్స్ చెక్ చేయించుకోవాలి. ప్లేట్ లెట్స్ మ‌రీ త‌క్కువైతే ప్రాణాపాయ ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయి. అయితే డెంగ్యూ మాత్ర‌మే కాదు, ఇత‌ర ఏ జ్వ‌రం వ‌చ్చినా స‌హ‌జంగానే ప్లేట్‌లెట్లు పడిపోతాయి. కానీ డెంగ్యూలో మ‌రీ ఎక్కువ‌గా ప్లేట్‌లెట్ల సంఖ్య త‌గ్గుతుంది. ఈ క్ర‌మంలోనే కింద తెలిపిన ఆహారాల‌ను తీసుకుంటే ప్లేట్‌లెట్లు ప‌డిపోకుండా చూసుకోవ‌చ్చు. వాటి సంఖ్య కూడా పెరుగుతుంది. డెంగ్యూ నుంచి త్వ‌ర‌గా కోలుకోవ‌చ్చు. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే..

డెంగ్యూ జ్వ‌రం వ‌చ్చి ప్లేట్‌లెట్లు బాగా త‌గ్గుతున్న వారు.. ఈ 10 అద్భుత‌మైన ఆహారాల‌ను తింటే ప్లేట్‌లెట్లు పెరుగుతాయి..!

1. బొప్పాయి పండ్ల‌ను తివ‌డం వ‌ల్ల డెంగ్యూ వ‌చ్చిన వారు త్వ‌ర‌గా కోలుకుంటారు. ప్లేట్‌లెట్ల సంఖ్య కూడా పెరుగుతుంది. బొప్పాయి చెట్టు ఆకుల ర‌సాన్ని పావు టీస్పూన్ చొప్పున రోజుకు ఒక‌టి లేదా రెండు సార్లు తాగుతుండాలి. దీని వ‌ల్ల కూడా ప్లేట్‌లెట్లు పెరుగుతాయి.

2. దానిమ్మ పండ్ల‌ను తింటున్నా ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది. దీంతో ర‌క్తం ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంది.

3. ఆకుప‌చ్చ‌గా ఉండే ఆకుకూర‌లు, కూర‌గాయ‌ల‌ను ఎక్కువ‌గా తింటుండాలి. దీంతో వాటిలో ఉండే విట‌మిన్ కె ప్లేట్‌లెట్లను పెంచుతుంది.

4. వెల్లుల్లి రెబ్బ‌ల్ని రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గడుపున 2 అలాగే న‌మిలి తినాలి. ప్లేట్‌లెట్ల సంఖ్య వృద్ధి చెందుతుంది.

5. రోజూ ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ చేశాక ఒక క‌ప్పు బీట్ రూట్ జ్యూస్‌ను తాగాలి. దీంతో ర‌క్తం పెర‌గ‌డ‌మే కాక‌ ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది.

6. క్యారెట్ల‌ను పూట‌కు ఒక‌టి చొప్పున తింటుండాలి. లేదా ఒక క‌ప్పు క్యారెట్ జ్యూస్‌ను ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌తో తీసుకోవాలి.

7. కిస్మిస్‌ల‌లో ఐర‌న్ అధికంగా ఉంటుంది. అందువ‌ల్ల వాటిని రోజూ గుప్పెడు మోతాదులో తింటే ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది.

8. ఆప్రికాట్ పండ్ల‌ను నిత్యం రెండు సార్లు తీసుకోవాలి. రెండు సార్లు క‌లిపి ఒక 30 గ్రాముల యాప్రికాట్ పండ్ల‌ను తినేలా చూసుకోవాలి. దీని వ‌ల్ల ప్లేట్‌లెట్లు పెరుగుతాయి.

9. ఖ‌ర్జూరాల‌ను రోజుకు 3 తినాలి. పూట‌కు ఒక కివీ పండును తినాలి.

10. నారింజ పండ్ల‌ను ఉద‌యం ఒక‌టి, సాయంత్రం ఒక‌టి తినాలి. లేదా ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో నారింజ పండ్ల ర‌సం తాగాలి.

ఇలా ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ప్లేట్‌లెట్ల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతుంది. డెంగ్యూ మాత్ర‌మే కాకుండా ఇత‌ర విష జ్వ‌రాల నుంచి కూడా త్వ‌ర‌గా కోలుకుంటారు.

Tags: dengueplateletsడెంగ్యూప్లేట్‌లెట్లు
Previous Post

ఎవ‌రికైనా స‌రే ఎత్తుకు త‌గిన విధంగా న‌డుం చుట్టు కొల‌త ఎంత ఉండాలో తెలుసా ?

Next Post

పిల్ల‌లు పుట్ట‌క‌పోవ‌డానికి స్త్రీ లేదా పురుషుడిలో ఎవ‌రు కార‌ణం అవుతారు ?

Related Posts

పోష‌కాహారం

చ‌ర్మ స‌మ‌స్య‌లు ఉన్నాయా.. అయితే ఈ పోష‌క ప‌దార్థం ఉండే ఆహారాల‌ను తినండి..

June 16, 2025
పోష‌కాహారం

ఇప్ప‌టి నుంచి మామిడి పండ్ల‌ను తినే వారు జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే.. ఎందుకంటే..?

June 3, 2025
పండ్లు

ప‌న‌స పండు.. పోష‌కాలు మెండు.. త‌ర‌చూ తింటే ఎన్నో లాభాలు..!

March 26, 2025
న‌ట్స్ & సీడ్స్

జీడిపప్పును నిత్యం తింటే మంచిదేనా..? ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..?

March 26, 2025
పోష‌కాహారం

అబ్బో.. సపోటాలో ఇంత మ్యాటరుందా.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే..!

March 15, 2025
పోష‌కాహారం

మేడిపండు అంటే ఏంటి.. దానిలో నిజంగా పురుగులు ఉంటాయా?

February 27, 2025
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.