డెంగ్యూ రాకుండా ఉండాలంటే ఈ ఆహారాల‌ను తీసుకోండి..!

ప్ర‌స్తుత త‌రుణంలో ఎక్క‌డ చూసినా చాలా మందికి డెంగ్యూ జ్వ‌రం వ‌స్తోంది. ఇప్ప‌టికే హాస్పిట‌ళ్లు డెంగ్యూ బాధితుల‌తో నిండిపోయాయి. దోమ‌లు కుట్ట‌డం వ‌ల్ల డెంగ్యూ జ్వ‌రం వ‌స్తుంద‌న్న విష‌యం విదిత‌మే. అందువ‌ల్ల దోమ‌ల‌ను నియంత్రించేందుకు స‌రైన చ‌ర్య‌లు తీసుకోవాలి. అలాగే డెంగ్యూ రాకుండా ఉండేందుకు గాను రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆహారాల‌ను తీసుకోవాలి. దీంతో ఆ వ్యాధి బారిన ప‌డ‌కుండా సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు. మ‌రి డెంగ్యూ రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

డెంగ్యూ రాకుండా ఉండాలంటే ఈ ఆహారాల‌ను తీసుకోండి..!

1. నిమ్మ జాతికి చెందిన పండ్ల‌లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని అమాంతం పెంచుతుంది. విట‌మిన్ సి వ‌ల్ల మ‌న శ‌రీరంలో తెల్ల ర‌క్త క‌ణాలు ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతాయి. ఇవి వ్యాధి కార‌క సూక్ష్మ జీవుల‌తో పోరాటం చేస్తాయి. అందువ‌ల్ల విట‌మిన్ సి ఉండే పండ్ల‌ను తినాలి. నిమ్మ‌, నారింజ‌, బ‌త్తాయి, ద్రాక్ష‌, కివీ, బొప్పాయి వంటి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. దీంతో డెంగ్యూ రాకుండా చూసుకోవ‌చ్చు.

2. వెల్లుల్లిలో అద్భుత‌మైన గుణాలు ఉంటాయి. అవి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. వ్యాధుల‌ను రాకుండా చూస్తాయి. అందువ‌ల్ల రోజూ ప‌ర‌గ‌డుపునే రెండు ప‌చ్చి వెల్లుల్లి రెబ్బ‌ల‌ను అలాగే తినేయాలి. దీని వ‌ల్ల డెంగ్యూ బారిన ప‌డ‌కుండా సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు.

3. పెరుగు అద్భుత‌మైన ప్రొ బ‌యోటిక్ ఆహారం. ఇది రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌పై ప్ర‌భావం చూపుతుంది. రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగేలా చేస్తుంది. అందువ‌ల్ల రోజూ ఆహారంలో పెరుగును తీసుకుంటే రోగాలు రాకుండా చూసుకోవ‌చ్చు.

4. ఆకుకూర‌ల‌న్నింటిలోనూ పాల‌కూర అత్యుత్త‌మ‌మైంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఇందులో విట‌మిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్ స‌మృద్ధిగా ఉంటాయి. ఇవ‌న్నీ రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగేందుకు స‌హాయ ప‌డ‌తాయి. అందువ‌ల్ల రోజూ పాల‌కూర‌ను తింటుండాలి. వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు.

5. బాదంప‌ప్పును రోజూ గుప్పెడు మోతాదులో తింటే ఏ వ్యాధి రాదు. వీటిలో ఉండే విట‌మిన్ ఇ రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచి అనారోగ్యాలు రాకుండా చూస్తుంది.

6. ప‌సుపులో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. అవి రోగ నిరోధక శ‌క్తిని పెంచుతాయి. ప‌సుపులో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు. రోజూ రాత్రి ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో కొద్దిగా ప‌సుపు క‌లుపుకుని తాగితే అనారోగ్యాల బారిన ప‌డ‌కుండా సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు.

7. అల్లం ర‌సంను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా రోగ నిరోధ‌క శక్తి పెరుగుతుంది. డెంగ్యూ రాకుండా చూసుకోవ‌చ్చు. రోజుకు రెండు పూట‌లా భోజ‌నం అనంత‌రం కొద్దిగా అల్లం ర‌సం సేవించాలి. లేదా అల్లంను నీటిలో వేసి మ‌రిగించి ఆ నీటిని రోజుకు రెండు సార్లు తాగ‌వ‌చ్చు. దీంతో రోగాలు రాకుండా ఉంటాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts