Healthy Foods : మనలో చాలా మంది రోజూ శారీరక శ్రమ ఎక్కువగా చేస్తుంటారు. నాలుగు చోట్లకు తిరుగుతారు. లేదా బాగా మాట్లాడాల్సి వస్తుంది. దీంతోపాటు చాలా మంది ఉద్యోగం చేసేందుకు గంటల తరబడి ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇదంతా శారీరక శ్రమ కిందకే వస్తుంది. దీంతో బాగా అలసిపోతుంటారు. సాయంత్రం అయ్యే సరికి శరీరంలో శక్తి ఏమీ ఉండదు. నీరసంగా అనిపిస్తుంది. దీంతో సాయంత్రానికి అసలు ఏ పని చేయలేకపోతుంటారు. అయితే ఉదయం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా రోజంతా యాక్టివ్‌గా ఉండవచ్చు. దీంతో చురుగ్గా పనిచేస్తారు. సాయంత్రం అయినా సరే శక్తి స్థాయిలు అలాగే ఉంటాయి. అందుకు గాను ఉదయం ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా అర కప్పు పాలకూర జ్యూస్‌ను తీసుకోండి. ఇందులో విటమిన్లు ఎ, సి, డి, కె, ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందజేస్తాయి. కంటి చూపును మెరుగు పరుస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగ నిరోధక శక్తిని పెంచి ఎముకలను బలంగా మారుస్తాయి. శరీరానికి అవసరం అయిన శక్తిని అందిస్తాయి. దీంతో రోజంతా చురుగ్గా ఉంటారు. అలాగే ఉదయం తీసుకోవాల్సిన ఆహారాల్లో ముల్లంగి కూడా ఒకటి. ఇందులో కూడా విటమిన్లు ఎ, కె అధికంగా ఉంటాయి. వీటిల్లోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. దీంతో క్యాన్సర్లు రావు. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేలా చేస్తాయి. అందువల్ల శక్తి బాగా లభిస్తుంది. అలాగే ఎముకలు బలంగా తయారవుతాయి. కనుక ఉదయం ఆహారంలో ముల్లంగిని తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. చురుగ్గా పనిచేయవచ్చు. నీరసం రాకుండా ఉంటుంది.
ఇక రాత్రంతా నానబెట్టిన నాలుగు ఎండు ఖర్జూరాలను ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా తినాలి. ఇవి అమితమైన శక్తిని అందిస్తాయి. రోజంతా చురుగ్గా ఉండేలా చేస్తాయి. అందువల్ల ఉదయం వీటిని తింటే సాయంత్రం కూడా యాక్టివ్‌గా ఉంటారు. నీరసం రాదు. వీటిల్లో కొవ్వు తక్కువగా క్యాలరీలు అధికంగా ఉంటాయి. కనుక శక్తి బాగా లభిస్తుంది. దీంతో యాక్టివ్‌గా ఉండవచ్చు. ఇక వీటిని తింటే మనకు అనేక పోషకాలు కూడా లభిస్తాయి. దీంతో రోగాల నుంచి రక్షణ కూడా లభిస్తుంది. ఇక ఉదయం రాగి జావను తాగితే రోజంతా చురుగ్గా ఉంటారు. దీని వల్ల శరీరానికి తగినంత కాల్షియం లభిస్తుంది. ఇది ఎముకలను బలంగా మారుస్తుంది. అలాగే ఈ జావను తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. షుగర్ లెవల్స్ తగ్గుతాయి. రక్తహీనత నుంచి బయట పడవచ్చు. రోజంతా చురుగ్గా పనిచేసేందుకు కావల్సిన శక్తి లభిస్తుంది. దీంతో సాయంత్రం కూడా చురుగ్గానే ఉంటారు. నీరసం రాకుండా ఉంటుంది. ఇలా పలు ఆహారాలను తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. చురుగ్గా పనిచేస్తారు. శక్తి స్థాయిలు తగ్గకుండా ఉంటాయి. పైగా పోషణ లభించి రోగాలు రాకుండా ఉంటాయి. కనుక ఈ ఆహారాలను ఉదయాన్నే తీసుకోవాలి.