Cabbage : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో క్యాబేజి కూడా ఒకటి. దీనితో మనం వివిధ రకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. కానీ చాలా మంది దీనిని తినడానికి ఇష్టపడరు. క్యాబేజి రుచి, వాసన కారణంగా దీనిని ఆహారంగా తీసుకోవడానికి విముఖత చూపిస్తారు. ఆరోగ్య నిపుణులు మాత్రం క్యాబేజిని కూడా తప్పకుండా ఆహారంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. క్యాబేజిలో మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఉన్నాయి.
మన ఆరోగ్యాన్ని , సౌందర్యాన్ని మెరుగుపరిచే గుణాలు క్యాబేజిలో చాలా ఉన్నాయి. గర్భిణీ స్త్రీలల్లో వచ్చే కీళ్ల నొప్పులను, కాళ్ల వాపులను క్యాబేజిని తీసుకోవడం ద్వారా నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనిలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉన్నాయి. అతి మూత్ర వ్యాధిని తగ్గించడంలో కూడా క్యాబేజి మనకు ఉపయోగపడుతుంది. క్యాబేజిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఉన్నాయి. రాత్రి పడుకునే ముందు క్యాబేజి ఆకులను తీసుకుని శరీరంలో వాపు ఉన్న చోట ఉంచి పై నుండి తొడుగు వేయాలి. ఇలా చేయడం వల్ల ఉదయం అయ్యే సరికి వాపులు తగ్గుతాయి.
అలాగే రాత్రి పడుకునే ముందు క్యాబేజ్ ఆకులను థైరాయిడ్ గ్రంథుల మీద ఉంచి ఉదయాన్నే తీసేయాలి. ఇలా చేయడం వల్ల థైరాయిడ్ గ్రంథులు ఉత్తేజమవుతాయి. శరీరంలో ఉన్న వ్యర్థాలను తొలగించడంలో, చర్మాన్ని మరియు జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో, రక్తపోటు నియంత్రించడంలో కూడా క్యాబేజ్ మనకు ఉపయోగపడుతుంది. అధిక బరువుతో బాధపడే వారికి కూడా క్యాబేజ్ దోహదపడుతుంది. శరీరంలో పేరుకపోయిన కొవ్వును కరిగించి బరువు తగ్గేలా చేయడంలో క్యాబేజ్ చక్కగా పని చేస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారు క్యాబేజ్ రసంలో నిమ్మరసం, ఉప్పు కలిపి తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో, జీర్ణ వ్యవస్థను సక్రమంగా పని చేసేలా చేయడంలో కూడా ఈ జ్యూస్ మనకు ఉపయోగపడుతుంది. క్యాబేజిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మెదడు పనితీరు పెరిగి మతి మరుపు సమస్య దూరమవుతుంది. పలు రకాల క్యాన్సర్ లను నివారించే గుణం కూడా క్యాబేజ్ కు ఉంది.
వృద్ధాప్య సమస్యలను, గుండె సంబంధిత సమస్యలను నయం చేసే శక్తి కూడా క్యాబేజికి ఉంది. దీనిని తరచూ ఆహారంగా తీసుకోవడం వల్ల దంత సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ విధంగా క్యాబేజ్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని.. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.