Thotakura : తోటకూరలో ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే.. తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..!

Thotakura : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల ఆకుకూరల్లో తోట కూర ఒకటి. సాధారణంగా దీన్ని చాలా మంది తినేందుకు ఇష్టపడరు. కానీ తోటకూరను తినడం మిస్‌ చేసుకుంటే అనేక ప్రయోజనాలను కోల్పోయినట్లే. తోటకూర మనకు అందుబాటులో ఉన్న చవకైన ఆకు కూరల్లో ఒకటిగా చెప్పవచ్చు.

amazing health benefits of Thotakura amazing health benefits of Thotakura

తోటకూరను చాలా మంది పప్పు లేదా ఫ్రై రూపంలో తీసుకుంటారు. కొందరు నేరుగా కూరగా వండుకుని తింటారు. అయితే తోటకూరను రోజూ ఒక కప్పు మోతాదులో జ్యూస్‌ రూపంలోనూ తీసుకోవచ్చు. దీంతో అనేక లాభాలు కలుగుతాయి.

తోటకూరలో కాల్షియం ఎక్కువగా లభిస్తుంది. పాలను తాగలేని వారు ప్రత్యామ్నాయంగా తోటకూరను తీసుకోవచ్చు. దీంతో పాలలో ఉండే పోషకాలు తోటకూర ద్వారా లభిస్తాయి. తోటకూరలో ఉండే కాల్షియం మన ఎముకలు, దంతాలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.

తోటకూరలో విటమిన్‌ ఎ, బి, సి, డి, ఇ, కె లతోపాటు విటమిన్‌ బి6, బి12, ఐరన్‌, మెగ్నిషియం, ఫాస్ఫరస్, జింక్‌, కాపర్‌, మాంగనీస్‌, సెలీనయం, సోడియం, పొటాషియం ఉంటాయి. అందువల్ల తోటకూరను పోషకాలకు గనిగా చెప్పవచ్చు. దీంతో పోషణ లభిస్తుంది. పోషకాహార లోపం ఉన్నవారు తోటకూరను తింటే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.

తోటకూరలో ఐరన్‌ అధికంగా ఉంటుంది. కనుక రక్తం బాగా తయారవుతుంది. ఇది రక్తహీనత ఉన్నవారికి మేలు చేస్తుంది. రక్తహీనత ఉన్నవారు రోజూ తోటకూరను తీసుకుంటే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.

తోటకూరలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది చిన్నారులు, తల్లులకు ఎంతగానో బలాన్ని అందిస్తుంది. ఎముకలను దృఢంగా ఉంచుతుంది. చిన్నారుల ఎముకల పెరుగుదలకు దోహదం చేస్తుంది.

హైబీపీ ఉన్నవారు రోజూ తోటకూరను తీసుకుంటే శరీరంలో రక్త సరఫరా మెరుగుపడుతుంది. దీంతో హైబీపీ తగ్గుతుంది. హార్ట్‌ ఎటాక్ లు రాకుండా జాగ్రత్త పడవచ్చు.

తోటకూరను తింటే రక్తం శుద్ధి అవుతుంది. గుండెకు రక్తసరఫరా మెరుగు పడుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.

తోటకూరలో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. కనుక జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా మలబద్దకం, గ్యాస్ నుంచి బయట పడవచ్చు. తోటకూరలో ఉండే పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు. వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.

అధిక బరువు తగ్గాలనుకునేవారు రోజూ తోటకూరను తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. బరువు త్వరగా తగ్గుతారు.

Admin

Recent Posts