Carrot : కంటికింపైన రంగులో కనిపించే క్యారెట్ చక్కని రుచితోనూ నోరూరిస్తుంది. రోజూ ఒకటి చొప్పున దీన్ని తినగలిగితే ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు. క్యారెట్‌లో ఉండే అనేక పోషకాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
క్యారెట్లను రోజూ తినడం వల్ల అల్సర్లు, గ్యాస్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. క్యారెట్లలో ఉండే ఫైబర్ మలబద్దకాన్ని పోగొడుతుంది.
అధిక బరువు తగ్గాలని అనుకునే వారు రోజూ క్యారెట్లను తినడం ఎంతో మేలు చేస్తుంది. వీటిల్లో ఉండే ఫైబర్ కొవ్వును కరిగిస్తుంది. బరువును నియంత్రణలో ఉంచుతుంది.
క్యారెట్లలో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది మన శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది. దీంతో లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. లివర్ సమస్యలు ఉన్నవారు రోజూ క్యారెట్ ను తింటే లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. లివర్‌లోని విష పదార్థాలు బయటకు పోతాయి.
క్యారెట్ల ద్వారా అందే విటమిన్ ఎ వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. రక్తం బాగా తయారవుతుంది. రక్త సరఫరా పెరుగుతుంది. హైబీపీ అదుపులోకి వస్తుంది. దీంతో గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవచ్చు.
క్యారెట్లలో ఉండే పోషకాలు శరీరంలోని విషవ్యర్థాలను బయటకు పంపిస్తాయి. శరీరంలోని ఇ న్ఫెక్షన్లు తగ్గించే యాంటీ సెప్టిక్ గా కూడా పని చేస్తాయి.
గోళ్లు, జుట్టు బలంగా పెరగడంతో పాటు చర్మానికి తాజాదనాన్ని క్యారెట్ అందిస్తుంది. మంచి ఛాయ కావాలనుకునేవారు రోజూ క్యారెట్ తినడం అలవాటు చేసుకోవాలి.