Egg Plant Health Benefits : వంకాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఇన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయా.. తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Egg Plant Health Benefits : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో వంకాయ‌లు కూడా ఒక‌టి. వంకాయ‌ల‌ను ఎంతో కాలంగా ఆహారంగా తీసుకుంటూ ఉన్నాము. వంకాయ‌ల్లో చాలా ర‌కాలు ఉంటాయి. వంకాయ‌ల‌తో మనం ర‌కర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ప‌చ్చ‌డి, కూర‌, మ‌సాలా కూర ఇలా అనేక ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. వంకాయ‌ల‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. అలాగే వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. అయితే చాలా మంది వంకాయ‌ల‌ను తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. వంకాయ‌ల‌తో చేసిన కూర‌ల‌ను చూడ‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌రు. కానీ ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె వంకాయ‌ల‌ను కూడా ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు.

వంకాయ‌ల‌ల్లో కూడా ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వంకాయ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏమిటి.. వీటిని ఎందుకు ఆహారంలో భాగంగా తీసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. వంకాయ‌లల్లో విట‌మిన్ కె, విట‌మిన్ బి6, పొటాషియం, మాంగ‌నీస్, ఫోలేట్, ఫైబ‌ర్ వంటి ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. వంకాయ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ వ్య‌వ‌స్థ మెరుగుప‌డుతుంది. శరీర ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.

Egg Plant Health Benefits in telugu you will be surprised to know
Egg Plant Health Benefits

అలాగే వంకాయ‌ల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శ‌రీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ ను న‌శింప‌జేసి క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధుల బారిన ప‌డ‌కుండా కాపాడ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. వంకాయ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. వీటిలో ఉండే ఫైబ‌ర్ ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలను అదుపులో ఉంచ‌డంలో దోహ‌ద‌ప‌డుతుంది. అంతేకాకుండా వంకాయల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. వంకాయ‌ల‌ల్లో నీరు ఎక్కువ‌గా ఉంటుంది. క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఇక వంకాయ‌ల‌ను తీసుకోవ‌డం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. వ‌య‌సుపై బ‌డ‌డం వ‌ల్ల వ‌చ్చే కంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.

వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. ఎముక‌ల సాంద్ర‌త పెరుగుతుంది. అలాగే చ‌ర్మాన్ని, జుట్టును మ‌రియు గోళ్ల‌ను ఆరోగ్యంగా ఉంచ‌డంలో కూడా వంకాయ‌లు మ‌న‌కు స‌హాయ‌ప‌డతాయి. ఈ విధంగా వంకాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆరోగ్య ప్ర‌యోజ‌నాలన్నీ పొందాలంటే మ‌నం కూడా త‌ప్ప‌కుండా వంకాయ‌ల‌ను ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే వంకాయ‌ల‌తో కూర‌లు వండేట‌ప్పుడు త‌క్కువ నూనెతో త‌యారు చేసి తీసుకోవాల‌ని వీలైనంత వ‌ర‌కు ఆవిరి మీద ఉడికించి తీసుకోవాలని అప్పుడే మన ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంద‌ని వారు తెలియ‌జేస్తున్నారు.

D

Recent Posts