పచ్చి బఠానీలను సాధారణంగా చాలా మంది పలు కూరల్లో వేస్తుంటారు. ఇవి చక్కని రుచిని కలిగి ఉంటాయి. కొందరు వీటని రోస్ట్ రూపంలో, కొందరు ఫ్రై రూపంలో చేసుకుని తింటారు. అయితే నిత్యం వీటిని తినడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిత్యం పచ్చి బఠానీలను తినడం వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగ్గా ఉంటుంది. జీర్ణ సమస్యలు ఉండవు. ఇందులో ఉండే ఫైబర్ మలబద్దకాన్ని తొలగిస్తుంది. రోజూ విరేచనం సాఫీగా అయ్యేలా చేస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
శరీరంలో ఐరన్ లోపిస్తే రక్తం బాగా తయారుకాదు. దీంతో రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. అయితే పచ్చి బఠానీలను తినడం వల్ల ఐరన్ బాగా లభిస్తుంది. ఎందుకంటే వీటిలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల నిత్యం వీటిని తింటే ఐరన్ అందుతుంది. ఫలితంగా రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.
పచ్చి బఠానీల్లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వీటిల్లో ఫైటో అలెక్సిన్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది హెచ్.పైలోరి ఇన్‌ఫెక్షన్ రాకుండా చూస్తుంది. ఈ బాక్టీరియా జీర్ణాశయంలో అల్సర్లకు, క్యాన్సర్లకు కారణం అవుతుంది. పచ్చి బఠానీలను తినడం వల్ల ఈ బాక్టీరియా నశిస్తుంది.
పచ్చి బఠానీల్లో లుటీన్ అనబడే కెరోటినాయిడ్ ఉంటుంది. ఇది కళ్లలో శుక్లాలు రాకుండా చూస్తుంది. కంటి చూపును మెరుగు పరుస్తుంది. కంటి ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది.
పచ్చి బఠానీల్లో ఉండే ఇన్‌సాల్యుబుల్ ఫైబర్ గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్ లు రాకుండా చూస్తుంది. శరీరంలో షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
పచ్చి బఠానీల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది చక్కని ఆహార ఆప్షన్ అని చెప్పవచ్చు. దీని వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఎక్కువ ఆహారం తినకుండా ఉంటారు.
పచ్చి బఠానీల్లో ఉండే విటమిన్ సి మన శరీరంలో కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో చర్మం దృఢంగా, కాంతివంతంగా ఉంటుంది. ఫ్రీ ర్యాడికల్స్ నిర్మూలించబడతాయి. పచ్చి బఠానీల్లో ఉండే ఫ్లేవనాయిడ్స్, కాటెచిన్స్, ఎపికాటెచిన్, కెరోటినాయిడ్స్ వృద్ధాప్య ఛాయలు రానీయవు. దీంతో చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.
పచ్చి బఠానీలు పురుషుల్లో శుక్ర కణాల సంఖ్యను పెంచుతాయి. అలాగే అవి ఎక్కువ వేగంగా కదిలే సామర్థ్యాన్ని పొందుతాయి. పచ్చి బఠానీలను తినడం వల్ల శుక్ర కణాలు దృఢంగా మారుతాయి. దీంతో సులభంగా అండంతో కలుస్తాయి. ఫలితంగా సంతాన లోపం సమస్య ఉండదు.
పచ్చి బఠానీలను ఉడకబెట్టుకుని తినవచ్చు. లేదా వాటిని సూప్‌లలో వేసి తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా ఆరోగ్యకర ప్రయోజనాలే కలుగుతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365