Green Peas : మనకు అందుబాటులో ఉన్న అత్యంత పోషక విలువలు కలిగిన ఆహారాల్లో పచ్చి బఠానీలు కూడా ఒకటి. వీటిని చాలా మంది తరచూ వాడుతూనే ఉంటారు. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ అధిక స్థాయిల్లో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి పచ్చి బఠానీలు ఎంతగానో మేలు చేస్తాయి. ఇవి షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. వీటిల్లో ఉండే ఫైబర్ తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అయ్యేలా చేస్తుంది. కనుక షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. అయితే ఏ ఆహారాన్ని అయినా సరే మితంగానే తినాలి.. అన్నట్లుగా.. పచ్చి బఠానీలను కూడా మితంగానే తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి మనకు ఆరోగ్యకరమైనవే. అయినప్పటికీ వీటిని తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. రోజుకు అర కప్పు మోతాదులో మాత్రమే తినాలి. లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. పలు అనారోగ్యాల బారిన పడతారు. పచ్చి బఠానీలను అధికంగా తింటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి బఠానీల్లో లెక్టిన్, ఫైటిక్ అనే యాంటీ న్యూట్రియెంట్లు ఉంటాయి. ఇవి మన జీర్ణాశయంలో అధిక మోతాదులో చేరితే గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. కనుక పచ్చి బఠానీలను మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఇక పచ్చి బఠానీలను అధికంగా తీసుకుంటే శరీరంలో ఉన్న కాల్షియం పోతుంది. దీంతో యూరిక్ స్థాయిలు పెరిగిపోతాయి. ఫలితంగా కీళ్లలో విపరీతమైన నొప్పి వస్తుంది. ఆ ప్రాంతంలో రాళ్లు ఏర్పడుతాయి. దీన్నే గౌట్ అంటారు. మన శరీరంలో యూరిక్ యాసిడ్ కొద్ది మోతాదులో ఉంటుంది. కానీ పచ్చి బఠానీలను అధికంగా తింటే మాత్రం యూరిక్ యాసిడ్ స్థాయిలు విపరీతంగా పెరిగిపోతాయి. కనుక వాటిని తక్కువగా తినాల్సి ఉంటుంది. లేదంటే విపరీతమైన అవస్థ పడాల్సి వస్తుంది.
పచ్చి బఠానీల్లో కార్బొహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల జీర్ణం కావడంలో ఇబ్బందులు ఏర్పడుతాయి. తక్కువ మొత్తంలో వీటిని తీసుకుంటే సులభంగానే జీర్ణం అవుతాయి. కానీ మోతాదుకు మించితే జీర్ణం కావు. దీంతో అజీర్ణం, విరేచనాలు వంటి సమస్యలు కూడా వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక వీటిని అధికంగా తినడం వల్ల బరువు పెరుగుతారు. కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉండవు. అలాగే విరేచనాలు కూడా వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. కనుక రోజుకు అర కప్పు కన్నా ఎక్కువ మోతాదులో పచ్చి బఠానీలను తీసుకోరాదు. వీటిని మోతాదులోనే తినాల్సి ఉంటుంది.