మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో దొండకాయలు కూడా ఒకటి. చాలా మంది వీటిని కూరగా, ఫ్రై రూపంలో తీసుకుంటారు. అయితే దొండకాయల్లో అనేక పోషకాలు ఉంటాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. దొండకాయలను రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. పలు యూనివర్సిటీలకు చెందిన సైంటిస్టులు ఈ విషయాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించారు కూడా. రోజూ దొండకాయలతో చేసిన జ్యూస్‌ను తాగడం వల్ల కొన్ని రోజులకు షుగర్ లెవల్స్ తగ్గినట్లు గుర్తించారు. అందువల్ల మధుమేహం ఉన్నవారు దొండకాయలను తరచూ తినడం మంచిది. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
2. అధిక బరువు సమస్యతో బాధపడేవారు దొండకాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిల్లో యాంటీ ఒబెసిటీ గుణాలు ఉంటాయి. దీని వల్ల మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
3. శరీరంలో ఐరన్ లోపించడం వల్ల అలసటగా అనిపిస్తుంది. ముఖ్యంగా మహిళల్లో ఐరన్ లోపం సమస్య ఎక్కువగా వస్తుంది. దీంతో రక్తహీనత కూడా వస్తుంది. అయితే దొండకాయల్లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే ఐరన్ లోపం సమస్యను పరిష్కరించుకోవచ్చు. దీంతో రక్తం వృద్ధి చెందుతుంది.
4. దొండకాయల్లో విటమిన్ బి2 ఉంటుంది. ఇది నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేందుకు సహాయ పడుతుంది. అందువల్ల దొండకాయలను తింటే నాడీ మండల సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా అల్జీమర్స్, ఎపిలెప్సీ, స్పర్శ లేకపోవడం, మల్టిపుల్ స్లెరాసిస్, ఆందోళన, కార్పల్ టర్నెల్ సిండ్రోమ్ వంటి సమస్యలు తగ్గుతాయి. నాడీ మండల వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది.
5. దొండకాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. మన శరీర జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయాలంటే ఫైబర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దొండకాయలను తినడం వల్ల లభించే ఫైబర్ జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా అల్సర్లు, హెమరాయిడ్స్, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణక్రియ మెరుగు పడుతుంది.
6. కిడ్నీ స్టోన్ల సమస్య ఉన్నవారు దొండకాయలను తరచూ తీసుకోవాలి. వీటిని తినడం వల్ల చిన్న చిన్న స్టోన్లు కరిగిపోతాయి. కిడ్నీ స్టోన్లు ఏర్పడకుండా ఉంటాయి.
దొండకాయలను రోజూ కూరలా చేసుకుని తినవచ్చు. లేదా సూప్‌లు, సలాడ్స్, జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. దీంతో పైన తెలిపిన ప్రయోజనాలు కలుగుతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365