Ivy Gourd : మనకు అందుబాటులో ఉండే అనేక రకాల కూరగాయల్లో దొండకాయలు కూడా ఒకటి. దొండకాయలను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. వీటితో వేపుడు, టమాటా కూర, దొండకాయ 65 వంటి కూరలను చేయవచ్చు. ఇవన్నీ ఎంతో రుచిగా ఉంటాయి. అయితే వాస్తవానికి దొండకాయలను చాలా మంది అంత పట్టించుకోరు. కానీ వీటిని తరచూ తీసుకోవడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. దొండకాయలతో జ్యూస్‌ను తయారు చేసి రోజూ పరగడుపునే 30 ఎంఎల్ మోతాదులో సేవించినా చాలు.. అనేక ప్రయోజనాలను పొందవచ్చు. దొండకాయలతో ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
దొండకాయల్లో మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ప్రధానంగా వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని తగ్గిస్తుంది. సుఖ విరేచనం అయ్యేలా చేస్తుంది. దొండకాయల జ్యూస్‌ను రోజూ తాగినా లేదా వాటిని నేరుగా తిన్నా కూడా జీర్ణవ్యవస్థ శుభ్రంగా మారుతుంది. దీంతో పేగులు, జీర్ణాశయంలో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. గ్యాస్ సమస్య ఉండదు. కడుపులో మంట కూడా తగ్గుతుంది. ఇక వీటిల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని సంరక్షించడంతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో సీజనల్ వ్యాధుల నుంచి బయట పడవచ్చు.
ఈ కాయలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తం అధికంగా తయారయ్యేలా చేస్తుంది. దీంతో రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే నీరసం, అలసట తగ్గుతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ఈ కాయల జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల అధిక బరువు ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. ఇది శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. దీంతో బరువు తగ్గుతారు. అలాగే వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలోకి వస్తాయి. షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఈ కాయలు డయాబెటిస్ ఉన్నవారికి వరం అని చెప్పవచ్చు.
వీటిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ కాయల్లో ఉండే పోషకాలు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రావు. రక్త సరఫరా మెరుగు పడుతుంది. వాపులు తగ్గుతాయి. ఈ కాయల్లో అధికంగా ఉండే విటమిన్ సి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. దీంతో ఇన్‌ఫెక్షన్లు రావు. ఇలా దొండకాయల వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కనుక వీటిని రోజువారీ ఆహారంలో తప్పకుండా భాగం చేసుకోవాలి.