Okra : బెండ‌కాయ‌ల‌ను ఇలా తీసుకుంటే.. ఎక్కువ ఫ‌లితం ఉంటుంది..!

Okra : మ‌నం అనేక ర‌కాల కూర‌గాయ‌ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వాటిలో బెండ‌కాయ కూడా ఒక‌టి. బెండ‌కాయ మ‌నంద‌రికి తెలిసిందే. దీనితో వేపుళ్లు, పులుసులు, కూర‌లు ఇలా ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బెండ‌కాయ‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. అయితే చాలామంది బెండ‌కాయ‌ను తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. బెండ‌కాయ జిగురుగా ఉంటుంద‌ని దీనిని తిన‌రు. కానీ ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె బెండ‌కాయ‌ను కూడా త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. బెండ‌కాయ‌లో కూడా అనేక ర‌కాల పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. ఫైబ‌ర్ తో పాటు మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు.

మ‌నం బెండ‌కాయ‌ను కూడా త‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా ఎందుకు తీసుకోవాలి.. బెండ‌కాయ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. బెండ‌కాయ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. దీనిలో ఉండే ఫైబ‌ర్ ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను నియంత్రించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు అలాగే షుగ‌ర్ వ్యాధి రాకుండా నిరోధించాల‌నుకునే వారు బెండ‌కాయ‌ను త‌మ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు బెండ‌కాయ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల చాలా త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. దీనిలో క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. అలాగే బెండ‌కాయ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల పొట్ట భావ‌న క‌లుగుతుంది. దీంతో మ‌న దృష్టి ఇత‌ర ఆహారాల‌పైకి వెళ్లకుండా ఉంటుంది. అదే విధంగా బెండ‌కాయ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల పొట్ట ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.

Okra this is the way to take them for many benefits
Okra

మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. జీర్ణ‌స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా బెండ‌కాయ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. దీంతో గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయి. అలాగే బెండ‌కాయ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కంటి చూపు మెరుగుప‌డుతుంది. కంటికి సంబంధించిన స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. అయితే చాలా మంది బెండ‌కాయ‌ల‌ను ఎక్కువ‌గా వేయించి తీసుకుంటూ ఉంటారు. దీని వల్ల బెండ‌కాయ‌లో ఉండే పోష‌కాలు న‌శిస్తాయి. క‌నుక బెండ‌కాయ‌ల‌ను త‌క్కువ నూనెలో వేయించి తీసుకోవాలి. అలాగే దీనిని ఆవిరి మీద ఉడికించి ఉప్పు, నిమ్మ‌ర‌సం చ‌ల్లుకుని కూడా తీసుకోవ‌చ్చు. ఈ విధంగా పోష‌కాలు న‌శించ‌కుండా బెండ‌కాయ‌ను తీసుకున‌ప్పుడే మ‌నం పైన తెలిపిన‌ ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts