Beetroot : బీట్‌రూట్‌ను ఇలా తీసుకుంటే ప్ర‌మాదం.. ఏం జ‌రుగుతుందంటే..?

Beetroot : బీట్ రూట్.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. దీనిని కూడా మ‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. చూడ‌డానికి చ‌క్క‌టి రంగులో ఉండే ఈ బీట్ రూట్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బీట్ రూట్ లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. బీట్ రూట్ ను ఆహారంగా భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. బీట్ రూట్ ను ఎలా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.. అలాగే దీని వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏమిటి..వంటి త‌దిత‌ర విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

పై భాగం చెక్కు బాగా ప‌లుచ‌గా ఉండే బీట్ రూట్ ను తీసుకోవ‌డం మంచిది. అలాగే ఈ చెక్కును వీలైనంత ప‌లుచ‌గా తొల‌గించ‌డానికి ప్ర‌య‌త్నం చేయాలి. అదే విధంగా బీట్ రూట్ పై భాగంలో ఉండే తొడిమ‌ను త‌క్కువ‌గా తొల‌గించే ప్ర‌య‌త్నం చేయాలి. అలాగే బీట్ రూట్ ను ముందుగా నీటితో శుభ్ర‌ప‌రిచిన త‌రువాత మాత్ర‌మే పై చెక్కును తీయాలి. చెక్కు తీసిన త‌రువాత బీట్ రూట్ ను క‌డ‌గ‌కూడ‌దు. అదే విధంగా ఈ బీట్ రూట్ ను వీలైనంత పెద్ద ముక్క‌లుగా క‌ట్ చేయాలి. అలాగే దీనిని కూర‌గా వండేట‌ప్పుడు కూడా దానిపై మూత‌ను ఉంచి వండాలి. అలాగే ఈ బీట్ రూట్ ను జ్యూస్ గా చేసి ఉద‌యం పూట తీసుకోవ‌డం మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ బీట్ రూట్ తో పాల‌కూర‌, క్యారెట్ వంటి వాటిని క‌లిపి స్మూతీగా చేసుకుని తాగ‌డం మంచిద‌ని వారు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

taking beetroot in this way will be harmful how to take
Beetroot

అలాగే ఈ జ్యూస్ ల‌లో పంచ‌దార‌, బెల్లం వంటి వాటిని క‌ల‌ప‌కుండా తీసుకోవాలి. బీట్ రూట్ జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది క‌దా అని ఒకేసారి దీనిని ఎక్కువ మొత్తంలో తీసుకోకూడదు. కొత్త‌గా బీట్ రూట్ జ్యూస్ ను తాగ‌డం అల‌వాటు చేసుకోవాల‌నుకునే వారు ముందుగా అర గ్లాస్ మోతాదులో ఈ జ్యూస్ ను తీసుకోవాలి. ఎటువంటి జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా ఉన్న‌ప్పుడు మాత్ర‌మే దీనిని ఒక గ్లాస్ మోతాదులో తీసుకోవాలి. బీట్ రూట్ జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. అలాగే వ‌య‌సు పైబ‌డే కొద్ది వ‌చ్చే మ‌తిమ‌రుపు స‌మ‌స్య కూడా త‌లెత్త‌కుండా ఉంటుంది. అలాగే బీట్ రూట్ లో యాంటీ ఇన్ ప్లామేట‌రీ గుణాలు అధికంగా ఉంటాయి.

దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో నొప్పులు, వాపులు త‌గ్గే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అలాగే బీట్ రూట్ జ్యూస్ ను తీసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మం మ‌రియు జుట్టు ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డి మ‌ల‌బ‌ద్దకం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. కంటి చూపు మెరుగుప‌డుతుంది. ర‌క్త‌పోటు త‌గ్గుతుంది. గుండె చ‌క్క‌గా ప‌ని చేస్తుంది. అంతేకాకుండా బీట్ రూట్ లో యాంటీ క్యాన్స‌ర్ గుణాలు కూడా ఉన్నాయి. బీట్ రూట్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మెద‌డు ప‌నితీరు మెరుగ‌వుతుంది. కాలేయంలోని తొల‌గిపోయి కాలేయం శుభ్ర‌ప‌డుతుంది. అయితే బీట్ రూట్ జ్యూస్ ను త‌గిన మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల మాత్ర‌మే దీని వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను మ‌నం పొంద‌వ‌చ్చు.

ఎక్కువ మొత్తంలో బీట్ రూట్ జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల జీర్‌ణ సంబంధిత స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంది. అలాగే శ‌రీరంలో క్యాల్షియం లోపం కూడా త‌లెత్త‌వ‌చ్చు. అంతేకాకుండా ఈ జ్యూస్ ఎక్కువ మొత్తంలో తీసుకోవ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల్లో రాళ్లు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అలాగే కొంద‌రిలో ఈ బీట్ రూట్ జ్యూస్ అల‌ర్జీల‌ను కూడా క‌లిగిస్తుంది. అలాగే దీనిని ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌లం, మూత్రం కూడా బీట్ రూట్ రంగులో వ‌చ్చే అవ‌కాశం ఉంది. క‌నుక ఈ బీట్ రూట్ ను త‌గిన మోతాదులో తీసుకుని చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌ల‌సిందిగా నిపుణులు సూచిస్తున్నారు.

D

Recent Posts