Onions : ప్రస్తుత కాలంలో చాలా మంది పాలిష్ పట్టిన ధాన్యాలను, అలాగే వాటికి సంబంధించిన ఇతర ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. అలాగే నూనెలో వేయించిన పదార్థాలను, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇటువంటి ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత ఫైబర్ లభించడం లేదు. దీంతో ప్రేగులు శుభ్రపడక వాటిలో మలం పేరుకుపోయి మలబద్దకం సమస్య తలెత్తుతుంది. ఇలా ప్రేగుల్లో మలం పేరుకుపోవడం వల్ల నిధానంగా ప్రేగుల్లో ఇన్ ప్లామేషన్ ప్రారంభమవుతుంది. ఆరోగ్యానికి మేలు చేసే బ్యాక్టీరియా తగ్గి హాని కలిగించే బ్యాక్టీరియా పెరుగుతుంది. దీంతో మలం ప్రేగుకు సంబంధించిన క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. ప్రస్తుత కాలంలో ఇలా మలం ప్రేగుకు సంబంధించిన క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
విదేశాల్లో వీరి సంఖ్య మరీ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల మలం పేరుకుపోయి ప్రేగులు పరిశుభ్రంగా ఉండవు. దీంతో కోలన్ క్యాన్సర్ బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలా ప్రేగులకు సంబంధించిన క్యాన్సర్ బారిన పడకుండా చేయడంలో ఉల్లిపాయ మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇటలీ దేశ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో ప్రేగులకు సంబంధించిన క్యాన్సర్ వచ్చే అవకాశాలను ఉల్లిపాయ తగ్గిస్తుందని నిరూపితమైనది. ప్రేగుల్లో బ్యాక్టీరియాల వల్ల కలిగిన ఇన్ ప్లామేషన్ ను తగ్గించకపోతే అక్కడ ఉండే కణజాలంలో మార్పు వచ్చి సాధారణ కణాలు కూడా క్యాన్సర్ కణాలుగా మారతాయి. ఈ ఉల్లిపాయలో ఉండే ఆనియోనిన్ ఎ, ఫైసటిన్, కోసటిన్ అనే రసాయన సమ్మేళాలు ప్రేగుల్లో తలెత్తే ఇన్ఫెక్షన్ ను, ఇన్ ప్లామేషన్ ను తగ్గించడంలో సహాయపడతాయి.
ఈ ఉల్లిపాయలను రోజూ 50 గ్రాముల మోతాదులో తీసుకోవడం వల్ల మనం ప్రేగులకు సంబంధించిన క్యాన్సర్ బారిన పడకుండా ఉంటాము. అయితే ఈ ఉల్లిపాయను వంటల్లో వేసి వాడడం వల్ల ఈ రసాయన సమ్మేళనాల ప్రభావం తగ్గుతుంది. కాబట్టి ఈ ఉల్లిపాయను సాధ్యమైనంత వరకు పచ్చిగానే తీసుకోవాలని అప్పుడే దాని వల్ల కలిగే ప్రయోజనాలను మనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొందరిలో జన్యుపరంగా కూడా ప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అలాంటి వారితో పాటు మలబద్దకం సమస్యతో బాధపడే వారు ఉల్లిపాయను ఈ విధంగా తీసుకోవడం వల్ల ప్రేగులకు సంబంధించిన క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారని నిపుణులు తెలియజేస్తున్నారు.