Off Beat

కొత్త‌గా పెళ్ల‌యిన యువ‌తి బామ్మ‌ని అడిగిన ప్ర‌శ్న‌.. త‌ప్పుడ‌ర్థం లేదు.. నీతి ఉంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక వృద్ధురాలు&period;&period; వాళ్ళ ఆయనతో రోజూ కాఫీ డబ్బా మూత తీయిస్తుండడం చూసిన పక్కింట్లోని కొత్తగా పెళ్లయిన ఓ అమ్మాయి… ఉండబట్టలేక అడిగింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బామ్మా&period;&period; మీరు రోజూ తాతగారితో ఇలా కాఫీ మూత ఎందుకు తీయిస్తున్నారు&period;&period; మీరే తీసుకోవచ్చు కదా అని&period;&period;&excl;&excl; అప్పుడు&period;&period; బామ్మ ఇలా చెప్పింది&period; మూత తీయడం పెద్ద కష్టం ఏమీ కాదమ్మా నేను తీయగలను&period; కానీ నా చేత కావడం లేదు మీరు కాస్త తీసివ్వండి అన్నప్పుడు&period;&period; ఆయన కళ్ళలో నేను బలశాలి అనే నమ్మకం కనబడుతుంది&period; నా భార్యకు అన్నీ నేనే నన్నే నమ్ముకుంది అనే ప్రేమ కనబడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87142 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;old-woman&period;jpg" alt&equals;"a married girl asked old woman a question " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వయసు పెరిగినా ఇంకా నా వల్ల ఏదో ఒక ఉపయోగం ఉంది అనే ఆత్మవిశ్వాసం కనబడుతుంది&period; ఈ భూమికి భారంగా నేను లేను అనే సంతోషం కనబడుతుంది&period; అందుకే ప్రతిరోజు ఇలా చేస్తాను&period; బామ్మ చెప్పిన సమాధానం విన్న నవ వధువు ఆశ్చర్యపోయింది&period; అసలైన భార్యాభర్తల సంబంధం విలువ ఏంటో తెలిసిందంటూ బామ్మకి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిజమే కదండీ&period;&period; మనిషి నావల్ల ఎటువంటి ఉపయోగం లేదు అనుకున్నప్పుడు కృంగిపోయి నశించిపోతారు&period; అలా కాకుండా ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్ల వారిని ఉన్నంతవరకు సంతోషంగా ఉంచొచ్చు కదా&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts