Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

క్యాండిల్స్ త‌యారీ బిజినెస్ అంటే.. డ‌బ్బులు క‌ట్టింది.. న‌మ్మి మోస‌పోయింది..

Admin by Admin
June 9, 2025
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

2021లో కరోనా వెళ్లి అప్పుడప్పుడే అందరికి కొంచెం బయట తిరిగే స్వాతంత్రం లభించింది. కరోనా వచ్చి అందరికి ఆర్థిక పాఠాలు చెప్పి వెళ్ళింది, అప్పటివరకు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టి పొదుపు అనే మాట ఒకటి ఉందని కూడా మర్చిపోయి ఉన్నాం. ఆర్థిక పరిస్థితులు మరీ దిగజారిపోయి కనీసం ఖర్చులకైనా ఏదో ఒక పని చేయాలి అనుకుని ఏం చేయాలో తెలియక యూట్యూబ్‌లో కనిపించిన ప్రతీ వీడియో చూసాను, అన్ని చేసేద్దాం అనే అనిపించింది కానీ ఏమి చేయలేకపోయాను. అలా ఒకరోజు ప్రముఖ న్యూస్ పేపర్లో ఒక యాడ్ చూసాను. కాండిల్స్ తయారు చేయండి, మేమే ముడి సరకు ఇస్తాం, ట్రైనింగ్ ఇచ్చి తయారైన కాండిల్స్ మేమే కొనుక్కుంటాం అని సారాంశం.

యాడ్ లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేసి మాట్లాడాను. చెన్నై అడ్రెస్స్ ఇచ్చారు. వాళ్ళ అడ్రస్ కి నా తమ్ముడిని పంపించాను. కాండిల్స్ ఎలా చేయాలో నేర్పించారు. 4000 రూపాయిలు కట్టించుకుని 5కేజీల మైనం, దారం, కాండిల్ తయారు చేసే మౌల్డ్ ఇచ్చారు. ఆ మరుసటి రోజు నుండి మేము ఇంట్లోనే కాండిల్స్ చేద్దాం అని దేవుడికి దండం పెట్టి స్టార్ట్ చేసాం. వాళ్ళు ఎలా చెప్పారో అలానే ట్రై చేసాం. ఆ క్యాండిల్ వాళ్ళకి వాట్సాప్ లో ఫొటోస్ పెట్టాను, క్యాండిల్ లో బుడగలు ఏర్పడ్డాయి, అవి పనికి రావు మళ్ళీ చేయండి అని చెప్పారు. ఇంకోసారి చేస్తే క్యాండిల్ కింది భాగంలో లోపలికి కుచించి పోయేది.

a women cheated by long candles making business

ఎంతో శ్రద్దగా ఎన్ని సార్లు ట్రై చేసిన ఏదో ఒకటి సమస్య వచ్చేది. కాండిల్స్ తయారు చేసి అవి మళ్ళీ కరిగించి చేసేసరికి మైనం తగ్గిపోయింది. ఏం చేయాలో తెలీలేదు, వాళ్ళు ఎలా నేర్పారో నువ్వెలా నేర్చుకున్నావు అని నేను మా తమ్ముడితో గొడవ పడ్డాను. ఇప్పుడు మనం చేసినట్టే చేసి చూపించారు అక్క అని చెప్పాడు, కాకపోతే వాళ్ళు ఉపయోగించిన మైనం వేరేలా ఉంది మనకి ఇచ్చింది వేరేది అనుకుంటాను అందుకే సరిగ్గా రావడం లేదా అని అనుమానపడ్డాడు. క్వాలిటీ మైనం ఎక్కడ దొరుకుతుందో తెలుసుకుని ఒక 2 కేజీలు తెచ్చాడు. ఆ మైనంతో క్యాండిల్ చేస్తే ఎటువంటి లోపం లేకుండా చాలా బాగా వచ్చాయి, మొత్తానికి సాధించాం అని చాలా ఆనందపడిపోయాం. ఆ ఫోటోలు వాళ్ళ వాట్సాప్ కి పంపించాను, ఇక అప్పటి నుండి వాళ్ళ మొబైల్ నెంబర్ పని చేయడం లేదు.

అప్పుడు గాని అర్థం కాలేదు low క్వాలిటీ మైనం ఇచ్చి, ఆ క్యాండిల్ మౌల్డ్ కి మా దగ్గర 4 వేలు కొట్టేసారని. వాళ్ళ అడ్రెస్స్ కూడా మొదటిసారి వెళ్ళినప్పుడే ఒక 1bhk రూంలో ఉన్నారు, ఇక ఈపాటికి మకాం మార్చేసి ఉంటారులే మళ్ళి అంతదూరం వెళ్లి శ్రమపడటం చార్జీలు దండగ అని ఆగిపోయాం. తయారుచేసిన కాండిల్స్ ఇంకేం చేస్తాం పవర్ కట్ అయినప్పుడు మేమే ఇంట్లోకి వాడేసాము. మాకు ఇలా జరిగిన ఆరేడు నెలలు తరువాత యూట్యూబులో దీని గురించి ఒక వీడియో చూసాము, ఇదో పెద్ద స్కాం అని, మాలాగ చాలామంది మోసపోయారని. ఈ వీడియో మాకు ఓ ఆరు నెలలు ముందు కనపడిన బాగుండే అని చింతించడం తప్ప ఇంకేమి చేయలేకపోయాము. ఇలా మొదటిసారి ఒక ప్రకటన చూసి మోసపోయాను. ఇదే నా మొదటి బిజినెస్. ఈ అనుభవంతో అయినా చాలా మంది ఇలాంటి మోసాల బారిన ప‌డ‌కుండా ఉంటార‌ని ఆశిస్తున్నా.

Tags: candles making
Previous Post

ఆప‌రేష‌న్ సిందూర్ త‌రువాత చాలా జాగ్ర‌త్త ప‌డుతున్న పాకిస్థాన్‌..?

Next Post

కమల్ హాసన్ నటించిన థగ్‌ లైఫ్‌ మూవీ ఎలా వుంది?

Related Posts

technology

ప్రతి వాట్సాప్ గ్రూప్ లో ఈ 6 రకాల మంది ఉంటారు…అందులో మీరు ఏ టైపో తెలుసుకోండి..!

June 9, 2025
lifestyle

భార్యాభ‌ర్త‌లు ఈ 3 సూత్రాల‌ను పాటిస్తే అస‌లు క‌ల‌హాలు రావు.. సంతోషంగా ఉంటారు..

June 9, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

దీర్ఘ‌కాలిక వ్యాధులు ఉంటే ఆయుష్షు త‌గ్గుతుంద‌ట‌..!

June 9, 2025
హెల్త్ టిప్స్

ప‌చ్చ క‌ర్పూరం వ‌ల్ల ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

June 9, 2025
వినోదం

కమల్ హాసన్ నటించిన థగ్‌ లైఫ్‌ మూవీ ఎలా వుంది?

June 9, 2025
international

ఆప‌రేష‌న్ సిందూర్ త‌రువాత చాలా జాగ్ర‌త్త ప‌డుతున్న పాకిస్థాన్‌..?

June 9, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!