Off Beat

క్యాండిల్స్ త‌యారీ బిజినెస్ అంటే.. డ‌బ్బులు క‌ట్టింది.. న‌మ్మి మోస‌పోయింది..

<p style&equals;"text-align&colon; justify&semi;">2021లో కరోనా వెళ్లి అప్పుడప్పుడే అందరికి కొంచెం బయట తిరిగే స్వాతంత్రం లభించింది&period; కరోనా వచ్చి అందరికి ఆర్థిక పాఠాలు చెప్పి వెళ్ళింది&comma; అప్పటివరకు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టి పొదుపు అనే మాట ఒకటి ఉందని కూడా మర్చిపోయి ఉన్నాం&period; ఆర్థిక పరిస్థితులు మరీ దిగజారిపోయి కనీసం ఖర్చులకైనా ఏదో ఒక పని చేయాలి అనుకుని ఏం చేయాలో తెలియక యూట్యూబ్‌లో కనిపించిన ప్రతీ వీడియో చూసాను&comma; అన్ని చేసేద్దాం అనే అనిపించింది కానీ ఏమి చేయలేకపోయాను&period; అలా ఒకరోజు ప్రముఖ న్యూస్ పేపర్లో ఒక యాడ్ చూసాను&period; కాండిల్స్ తయారు చేయండి&comma; మేమే ముడి సరకు ఇస్తాం&comma; ట్రైనింగ్ ఇచ్చి తయారైన కాండిల్స్ మేమే కొనుక్కుంటాం అని సారాంశం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాడ్ లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేసి మాట్లాడాను&period; చెన్నై అడ్రెస్స్ ఇచ్చారు&period; వాళ్ళ అడ్రస్ కి నా తమ్ముడిని పంపించాను&period; కాండిల్స్ ఎలా చేయాలో నేర్పించారు&period; 4000 రూపాయిలు కట్టించుకుని 5కేజీల మైనం&comma; దారం&comma; కాండిల్ తయారు చేసే మౌల్డ్ ఇచ్చారు&period; ఆ మరుసటి రోజు నుండి మేము ఇంట్లోనే కాండిల్స్ చేద్దాం అని దేవుడికి దండం పెట్టి స్టార్ట్ చేసాం&period; వాళ్ళు ఎలా చెప్పారో అలానే ట్రై చేసాం&period; ఆ క్యాండిల్ వాళ్ళకి వాట్సాప్ లో ఫొటోస్ పెట్టాను&comma; క్యాండిల్ లో బుడగలు ఏర్పడ్డాయి&comma; అవి పనికి రావు మళ్ళీ చేయండి అని చెప్పారు&period; ఇంకోసారి చేస్తే క్యాండిల్ కింది భాగంలో లోపలికి కుచించి పోయేది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87666 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;long-candles-making&period;jpg" alt&equals;"a women cheated by long candles making business " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎంతో శ్రద్దగా ఎన్ని సార్లు ట్రై చేసిన ఏదో ఒకటి సమస్య వచ్చేది&period; కాండిల్స్ తయారు చేసి అవి మళ్ళీ కరిగించి చేసేసరికి మైనం తగ్గిపోయింది&period; ఏం చేయాలో తెలీలేదు&comma; వాళ్ళు ఎలా నేర్పారో నువ్వెలా నేర్చుకున్నావు అని నేను మా తమ్ముడితో గొడవ పడ్డాను&period; ఇప్పుడు మనం చేసినట్టే చేసి చూపించారు అక్క అని చెప్పాడు&comma; కాకపోతే వాళ్ళు ఉపయోగించిన మైనం వేరేలా ఉంది మనకి ఇచ్చింది వేరేది అనుకుంటాను అందుకే సరిగ్గా రావడం లేదా అని అనుమానపడ్డాడు&period; క్వాలిటీ మైనం ఎక్కడ దొరుకుతుందో తెలుసుకుని ఒక 2 కేజీలు తెచ్చాడు&period; ఆ మైనంతో క్యాండిల్ చేస్తే ఎటువంటి లోపం లేకుండా చాలా బాగా వచ్చాయి&comma; మొత్తానికి సాధించాం అని చాలా ఆనందపడిపోయాం&period; ఆ ఫోటోలు వాళ్ళ వాట్సాప్ కి పంపించాను&comma; ఇక అప్పటి నుండి వాళ్ళ మొబైల్ నెంబర్ పని చేయడం లేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పుడు గాని అర్థం కాలేదు low క్వాలిటీ మైనం ఇచ్చి&comma; ఆ క్యాండిల్ మౌల్డ్ కి మా దగ్గర 4 వేలు కొట్టేసారని&period; వాళ్ళ అడ్రెస్స్ కూడా మొదటిసారి వెళ్ళినప్పుడే ఒక 1bhk రూంలో ఉన్నారు&comma; ఇక ఈపాటికి మకాం మార్చేసి ఉంటారులే మళ్ళి అంతదూరం వెళ్లి శ్రమపడటం చార్జీలు దండగ అని ఆగిపోయాం&period; తయారుచేసిన కాండిల్స్ ఇంకేం చేస్తాం పవర్ కట్ అయినప్పుడు మేమే ఇంట్లోకి వాడేసాము&period; మాకు ఇలా జరిగిన ఆరేడు నెలలు తరువాత యూట్యూబులో దీని గురించి ఒక వీడియో చూసాము&comma; ఇదో పెద్ద స్కాం అని&comma; మాలాగ చాలామంది మోసపోయారని&period; ఈ వీడియో మాకు ఓ ఆరు నెలలు ముందు కనపడిన బాగుండే అని చింతించడం తప్ప ఇంకేమి చేయలేకపోయాము&period; ఇలా మొదటిసారి ఒక ప్రకటన చూసి మోసపోయాను&period; ఇదే నా మొదటి బిజినెస్&period; ఈ అనుభవంతో అయినా చాలా మంది ఇలాంటి మోసాల బారిన à°ª‌à°¡‌కుండా ఉంటార‌ని ఆశిస్తున్నా&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts