Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

సినిమా డైరెక్ట‌ర్‌కు తాత నేర్పిన పాఠం..!

Admin by Admin
February 18, 2025
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఒక పల్లెటూరు లో ఒక హోటల్ ఉంది… అక్కడకి ఒక సినిమా వాళ్ళు 40మంది వచ్చారు . అంత మంది ఒకేసారి రావడంతో ఆ హోటల్ లో జనం అంతా సినిమా వాళ్ళనే చూస్తున్నారు. సినిమా వాళ్ళు ఎంతో గర్వం గా ఫీల్ అయి పోతూన్నారు… అందరు హోటల్ లోకూర్చుని ఉన్నారు ఇంతలో అక్కడికి డైరెక్టర్ వచ్చారు… అందరూ భోజనం చేస్తున్నారు. ఇంతలో డైరెక్టర్ అక్కడ వాళ్ళందరిని చూస్తున్న ఒక్క తాతని చూసాడు… చూడగానే ఎందుకో ఆ తాత అలా చూస్తున్నాడు అని తెలుసుకుందాం అని తాతా ఇటురా అని పిలిచాడు… ఏం తాతా భోజనం చేసావా అని అడిగాడు… తాత చేసానయ్య అని చెప్పాడు… మరి ఎందుకు తాత ఇందాకటి నుంచి అక్కడ కూర్చుని మా అందరిని చూస్తున్నావ్ సినిమా అంటే నీకు ఇష్టమా అని అడిగాడు…

అదేం లేదయ్యా అని కొంచెం దీనంగా మొహం పెట్టి చెప్పాడు… మరి ఏంటి ఏమైనా డబ్బు లు కావాలా ఏమన్నా ఉంటే చెప్పు నేను సహాయం చేస్తా అని అడిగాడు… అదేం లేదయ్యా .. నేను ఒక్కటి అడగాలి అనుకుంటున్నా …. అడగనా అన్నాడు … సరే తాత అడుగు ఏంటో అని అన్నాడు… మీరు ఇంత కష్టపడి సినిమా తీస్తారు కదా, ఆ సినిమా ఎవరైనా విడుదల అవ్వక ముందే పైరసీ చేస్తే ఏం చేస్తారు …?? అని అడిగాడు. ఏముంది …. అలా చేసిన వాడిని జైల్లో పెడతాం.. ఇంకా లక్షలో జరిమానా వేస్తారు, ఇవన్నీ నీకు ఎందుకు తాత అని అన్నాడు. అప్పుడు ఆ తాత …మరి ఎందుకు బాబు మీరు ఇంత కష్టపడి సినిమాలు తీస్తున్నారు అని అడిగాడు. అప్పుడు డైరెక్టర్ ప్రజల కళ్ళల్లో ఆనందం చూడటానికి అని చెప్పాడు గర్వంగా …

an old man taught a lesson to a film director

అపుడు తాత అడిగాడు …… మీరు ఇంత మంది ఇక్కడ భోజనం చేసారు కదా దాంట్లో అక్కడ చూడు చాల మంది సగం అన్నంలో చేతులు కడిగేసారు. అందుకే నేను అలా చూస్తున్నా మిమల్ని అని అన్నాడు… దానికి నీకు అంత బాధ ఎందుకు తాతా ….. ఆ డబ్బులు నువ్వు ఎం కట్టట్లేదుగా.. అవి మా నిర్మాత కడతాడు అని వేలాకోలంగా అన్నాడు… అపుడు ఆ తాత అన్నాడు… మీ సినిమా ఎవరో దోపిడీ చేస్తే మీరు వాళ్ళని జైల్లో పెట్టిస్తారు జరిమానా కట్టిస్తారు… కానీ మేము పండించే పంట దళారులు దోపిడీ చేస్తున్నా మేము ఎంతో జాగ్రత్తగా పంటని అమ్మలా చూసుకుని పండిస్తాం బాబు ఎందుకో తెలుసా అన్నాడు…?? డైరెక్టర్కి ఏం చెప్పాలో తెలియక ఎందుకు అని అడిగాడు…?? ఆ తాత ఇలా చెప్పాడు ….. కోట్లు ఉన్న కోటీశ్వరుడు అయినా, దిక్కు లేని వాడికి అయినా ఆకలి వేస్తుంది కోట్లు ఉన్న వాడు కొనుక్కు తింటాడు, దిక్కు లేని వాడు అడుక్కు తింటాడు… కానీ ప్రతి ఒక్కరు తిండి తినాలి.. ఆకలి తో ఉన్న వాడు ఏదో ఒక్కసారి అయినా మమ్మల్ని గుర్తు చేసుకోకపోయినా వారి కడుపు లోని పేగులు గుర్తు చేసుకుంటాయి అని చెప్పాడు…

అందుకే బాబు …. ఇందాక మీరు సగం అన్నం లో చేతులు కడుగుతూ ఉంటే నాకు బాధ కలిగి చూసానే కానీ మీరు నాకు సహాయం చేస్తారు అని కాదు… ఈ దేశం లో ప్రతి రోజు ఆత్మహత్య చేసుకుని చనిపోయే వారిలో ఎక్కువ శాతం రైతులు ఉంటారు కానీ సినిమా వాళ్ళు కాదు … మీరు మా చావుల్ని ఎలాగో అపలేరు కనీసం భోజనం చేస్తున్నపుడు అయినా ఎంత కావాలో అంత తిని మిగతాది వృధా చేయకండి బాబు… ఈ విషయం మీకు ఎందుకు చెపుతున్నా అంటే మద్యపానం ఆరోగ్యానికి హానికరం…ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని సినిమాలో వేస్తారు.. అలాగే ఎక్కడో ఒక్క చోట అన్నం వృదా చేయటం వల్ల ఒక్క మనిషి కి అన్నం లేకుండా పోతుంది అని చెప్తారు అని బాబు అంతే అని చెప్పి వెళ్ళిపోయాడు…

Tags: movie directorold man
Previous Post

ఈ 5 లక్షణాలు ఉన్న అమ్మాయిల‌ని పెళ్లి చేసుకోవాల‌ట.. !

Next Post

ఈ విష‌యాల‌ను పురుషుల‌కు స్త్రీలు చెప్ప‌రు.. ర‌హ‌స్యంగా ఉంచుతారు..!

Related Posts

వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025
హెల్త్ టిప్స్

రాత్రి పూట ఇలా చేస్తే ప‌డుకున్న వెంట‌నే నిద్ర ప‌ట్టేస్తుంది..!

July 4, 2025
వైద్య విజ్ఞానం

భార‌తీయ మ‌హిళ‌ల్లో పెరుగుతున్న గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్‌.. ఈ ల‌క్ష‌ణాలు ఉంటే జాగ్ర‌త్త‌..!

July 4, 2025
వైద్య విజ్ఞానం

మీకు డ‌యాబెటిస్ ఉందా..? అయితే మీ చ‌ర్మం ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే..!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.