Off Beat

ఇప్పుడున్న కొండచిలువలు మనుషుల్ని మింగగలవా?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక్క అనకొండలు మాత్రం మనిషిని మ్రింగగలవ్ అనుకుంటే అది హాలీవుడ్ సినిమా అనకొండ ప్రభావమే&excl; అలానే గ్రేట్ ఆఫ్రికన్ రాక్ పైథాన్ ఖచ్చితంగా మ్రింగగలదు అని అనుకుంటే డిస్కవరీ బాగా చూస్తున్నారని అర్థం&period; ఐతే ఇవి పిల్లలను మ్రింగగలవు&period; ఇండియన్ పైథాన్ కూడా అంతే&excl; ఐతే రిటైక్యులేటెడ్ పైథాన్ మాత్రం మిగతా అన్నింటిలోకీ పెద్ద కొండచిలువ జాతి&period; ప్రపచంలోనే అతి పెద్ద పాము&period; ఏ కొండచిలువైనా ఇదారేళ్ళ పిల్లల్ని తేలిగ్గా మ్రింగేయగలదు&period; ఇవి సాధారణంగా గొఱ్ఱెలను&comma; మేకలను&comma; దుప్పిలను పట్టుకుంటాయ్ కనుక అదే పరిమాణంలో మనిషి కనపడ్డా దాడి చేస్తాయి&period; పూర్తిగా ఎదిగిన మనిషినైతే మ్రింగడం వాటికి చాలా ఇబ్బందే&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ ఇప్పటి దాకా అసలు కొండచిలువలు మనిషిని చంపిన దాఖలాలు ఒకటీ అరా ఉన్నా ఓ సగటు మనిషిని మ్రింగింది మాత్రం ఇటీవలే&excl;&excl; ఇండోనేషియాలో రిటైక్యులేటెడ్ పైథాన్ ఓ పాతికేళ్ళ రైతుని రెండు నిమిషాల్లో చంపినా మ్రింగేందుకు ఎన్నో గంటలు పట్టింది&period; ఆ తర్వాత దాని పొట్ట కోసి అతడి శవాన్ని బయటకు తీశారు&period; ఇప్పటిదాకా ఇదే మొదటి ఘటన&period; ఐతే ఇవి ఊరికే మన జోలికి రావ్&period; కానీ&comma; వాటికి ఉండే పళ్ళు మాత్రం రేగు ముల్లు లాగా కొస లోపలికి తిరిగి ఉండి&comma; అది పట్టుకున్నాక మనం వెనక్కు తీసుకునే ప్రయత్నంలో ఇంకా ఎక్కువ గాయం చేసేట్టుగా ఉంటాయ్&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91928 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;python&period;jpg" alt&equals;"are the pythons able to swallow humans " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా తను మ్రింగలేని వాటిపై అవి దాడి చెయ్యవ్&comma; భయపడితే తప్ప&period; అవి ఒకసారి భోజనం చేస్తే కొన్ని నెలల వరకూ తిండి తినవ్&period; ఒకవేళ ఎవరి ఇంటి అవరణలో అయినా కొండ చిలువలు భోంచేసి పడుకుంటే వాటి జోలికి పోకుండా ఉంటే సరి&period; అటవీశాఖ అధికారులకి చెప్తే వాళ్ళు చూసుకుంటారు&period; ఈలోపు తొందరపడి మనం ఏమీ చెయ్యకుండా ఉంటేనే మేలు&period; ఏ కొండ చిలువకీ విషం ఉండదు&period; అలా అని రక్త పింజరకీ కొండ చిలువకూ వ్యత్యాసం తెలియకుండా&comma; దగ్గరకు వెళ్ళకుండా ఉంటేనే మంచిది&period; రక్త పింజరకి విషం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts