Off Beat

తినేందుకు తిండి లేక మంచాన ప‌డ్డ త‌ల్లికోసం ఓ బాలుడు చేసిన ప‌ని.. చ‌దివితే క‌న్నీళ్లు వ‌స్తాయి..

ఒక పిల్లాడు ఒక ఇంటి బెల్ కొట్టాడు. యజమానురాలు బయటకు వచ్చి ఏమిటిది? అని అడిగింది. చిన్నారి: ఆంటీ, నేను మీ తోటను శుభ్రం చేయాలా? ఇల్లాలు: లేదు. చిన్నారి – చేతులు జోడించి.. ప్లీజ్ ఆంటీ, నేను దానిని సరిగ్గా శుభ్రం చేస్తాను. ఇల్లాలు – సరే, ఎంత తీసుకుంటావు. చిన్నారి: డబ్బు వద్దు ఆంటీ, దయచేసి నాకు భోజనం ఇవ్వండి. ఇల్లాలు- సరే..

(పిల్లాడు ఆకలితో ఉన్నట్లు కనిపిస్తోంది, ముందు అతనికి కొంత ఆహారం ఇస్తాను… ఇల్లాలు అనుకుంది )

ఇల్లాలు: అబ్బాయి.. ముందు భోజనం చేయి, తర్వాత పని చేయి… చిన్నారి- లేదు ఆంటీ , ముందు నేను పని చేస్తాను, ఆపై మీరు నాకు ఆహారం ఇవ్వవచ్చు… ఇల్లాలు- సరే! ఇలా చెప్పి ఆమె తన పనిలో మునిగిపోయింది. పిల్లవాడు: ఒక గంట తర్వాత, ఆంటీ , శుభ్రం చేశాను చూసుకోండి… ఇల్లాలు – ఓహ్ వావ్! నువ్వు చాలా బాగా శుభ్రం చేసావు, పాట్స్ చక్కగా అమర్చావు.. ఇక్కడ కూర్చో, నేను ఆహారం తెస్తాను..

boy did wonderful act to help her ill mother

ఇల్లాలు అతనికి ఆహారం ఇవ్వగానే, పిల్లవాడు తన జేబులోంచి ఒక ప్లాస్టిక్ సంచిని తీసి అందులో ఆహారం పెట్టడం ప్రారంభించాడు.

ఇల్లాలు: నువ్వు పనిచేశావు, ఇప్పుడు ఇక్కడ కూర్చుని తిను… నీకు ఇంకా అవసరమైతే నేను ఇస్తాను.. పిల్లవాడు: లేదు అమ్మా, నా అనారోగ్యంతో ఉన్న తల్లి ఇంట్లో ఉంది. నేను ప్రభుత్వ ఆసుపత్రి నుండి మందు తెచ్చుకున్నాను, కానీ డాక్టర్ ఖాళీ కడుపుతో మందు తీసుకోకూడదని చెప్పాడు. ఇల్లాలు అవాక్కయి అయింది., తన చేతులతోనే ఆ బిడ్డకు తినిపించి, పిల్లాడితో అతని ఇంటికి వెళ్ళింది..

అతని తల్లి కోసం రొట్టెలు తయారు చేసి… మరియు అతని ఇంటికి వెళ్లి అతని తల్లికి రొట్టెలు ఇచ్చింది…

పిల్లాడి తల్లితో- నువ్వు చాలా ధనవంతురాలివి… నువ్వు నీ కొడుకుకి ఇచ్చిన సంస్కారం అన్ని సంపదల కంటే గొప్పది.., దేవుడు యిలాంటి పిల్లలను ఇచ్చాడు. చాలా అదృష్టవంతులు మీరు.. అంది.

Admin

Recent Posts