మనం ఇండియాలో భాగమైనందుకు ఎంతో గర్వపడాలి. మన ఇండియా… ప్రపంచానికి అందించిన వాటి గురించి మనలో చాలా మందికి తెలియదు. మన దేశంలోని గొప్ప వారు.. చాలా వాటిని కనిపెట్టారు. ఇప్పుడు ఆ వస్తువులకు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. మన ఇండియాలో వీటికి ఎక్కువగా ఆదరణ లేకున్నా.. ప్రపంచ నలు మూలల వీటికి డిమాండ్ ఎక్కువే. అవేంటో ఇప్పుడు చూద్దాం.
1. జీరో
సున్న.. శూన్యం ప్రపంచ గణిత చరిత్రలో ఇండియా గణితజ్ఞుల స్థానం సున్నతో సుస్థిరమైనది. సున్నా అనేది ఒక వింత అంకె. మానవ ఊహాజనిత విరోధాభాసం. ఈ సున్నాను.. ఇండియా గణిత శాస్త్రవేత్త బ్రహ్మగుప్తుడు సుమారు. క్రీశ 628 న ప్రతిపాదించారు. దీనిని ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వాడుతున్నారు.
2. షాంపూ
షాంపూ అనే పదం హిందీ పదం ‘చంపో’ నుండి అలాగే.. సంస్కృత పదం ‘చపయతి’ నుండి మరింత ఉద్భవించింది. ఇండియాలో దీనిని 1762లోనే వాడటం మొదలు పెట్టారు.
3. బటన్లు
బటన్లు.. సింధు లోయ నాగరికతకు సంబంధించినవి. బటన్ సుమారు 5000 సంవత్సరాల పురాతనమైనది. వంపుతో కూడిన షెల్‌తో తయారు చేయబడింది.
4. స్టీల్ మరియు మెటల్ పనులు
క్రీ.పూ. 300 – 200 మధ్యకాలంలో అధిక స్వచ్ఛత కలిగిన ఇనుము, బొగ్గు మరియు గాజులను కలపడం ద్వారా నాణ్యత కలిగిన ఉక్కును భారతదేశంలో ఉత్పత్తి చేశారు.
5. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ భాషలు
J Sharp మరియు Kojo వంటి అనేక ప్రోగ్రామింగ్ భాషలను మన ఇండియన్సే కనిపెట్టారు.