Off Beat

భార్య‌కు భ‌ర్త ఎంత విలువ ఇవ్వాలో చెప్పే క‌థ‌.. చిన్న స్టోరీ..

ఒక కొడుకు, తండ్రి రాత్రిభోజనం చెయ్యటానికి కూర్చున్నారు. ఎప్పుడూ చాలా రుచిగా వండి పెట్టే అమ్మ ఆ రోజు చపాతి తెచ్చి తండ్రికి ఇచ్చింది. చపాతీ మాడిపోయి ఉంది నల్లగా. కొడుకు తండ్రి వైపు చూసాడు ఏమంటాడో అని తండ్రి మామూలుగా చపాతి తింటూ భార్యని అడిగాడు ఇవాళ పని ఎక్కువగా చేసి అలసిపోయినట్టున్నావు కదా అని. భార్య సమాధానంగా చెప్పింది. చపాతి మాడిపోయినట్టుంది కదా పాపం, మీకు ఇబ్బందిగా ఉంది కదా తింటానికి. భర్త వెంటనే లేదు బంగారం నాకు చపాతి నచ్చింది నువ్వు ఇంక వెళ్ళి విశ్రాంతి తీసుకో అన్నాడు.

తల్లి వెళ్ళగానే కొడుకు ఉండబట్టలేక తండ్రిని వెంటనే అడిగేసాడు. నాన్నా నీకు నిజంగా చపాతి నచ్చిందా అంత మాడిపోయినది అని. తండ్రి కొడుకు భుజం మీద ఆప్యాయంగా చెయ్యి వేసి చెప్పాడు అమ్మ పొద్దున్నుంచీ పనులన్నీ చేస్తూ అలసిపోయి ఉంది అంత అలసటలోనూ నాకు తినడానికి తెచ్చింది నేను బాలేదు అని ఉంటే బాధపడేది నాకు నా రుచుల కంటే అమ్మ కష్టం గురించే ఆలోచించాలనిపించింది..

father told importance of mother to a son

నా ఒక్క సాధింపు తన కష్టాన్ని రెట్టింపు చేస్తుంది.. నా ఒక్క ప్రేమపూర్వకమైన మాట తనకి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునేందుకు తోడ్పడుతుంది అని చెప్పాడు.

ఇలా కొడుక్కి ఏ రోజు కారోజు తల్లితండ్రి ప్రేమ అర్ధమౌతూ ఉంది. భవిష్యత్తులో అతనూ ప్రేమకు విలువిచ్చే ఒక మంచి హృదయశీలిగా ఎదుగుతాడు.. ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ప్రేమానురాగం, సహాయసహకారం.. జీవితగమనానికి నిజమైన, ధృడమైన ఆధారం..

Admin

Recent Posts