చాయ్.. టీ.. తేనీరు.. ఏ భాషలో పిలిచినా ఇది లేనిదే కొంత మందికి రోజు గడవదు. ఉదయం బెడ్ టీతో మొదలుకొని సాయంత్రం, రాత్రి నిద్రించే వరకు కూడా కొందరు టీని కప్పుల కొద్దీ తాగుతుంటారు. ఇలాంటి చాయ్ లవర్లు చాలా మందే ఉంటారు లెండి. అయితే ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. రోజుకు ఒకటి, రెండు కప్పుల చాయ్ తాగే వారి కన్నా అంతకు మించి ఎక్కువ కప్పుల టీ తాగే వారికి చాయ్‌తో కొన్ని అవినాభావమైన, విడదీయలేని సంబంధాలు ఉంటాయి. అవేమిటో ఇప్పుడు ఒక సారి చూద్దాం. 1. చాయ్.. సుప్రభాతం.. ఉదయం లేవగానే మనకు ఆలయం నుంచి సుప్రభాతం ఎలా రోజూ వినిపిస్తుందో అలాగే కొందరికి చాయ్ సుప్రభాతమే అవుతుంది. ఉదయం నిద్ర లేవగానే బెడ్‌పైనే ఉండి మొదట ఒక కప్పు చాయ్ తాగి గానీ కొందరు రోజులో పని మొదలు పెట్టరు. ఇక అలాంటి వారికి ఒక్కరోజు అలా చాయ్ మిస్ అయితే రోజంతా ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది. ఏమంటారు.. ఇది నిజమే కదా. చాలా మంది దీన్ని ఎక్స్‌పీరియెన్స్ చేసి ఉంటారు.
2. ఒక కప్పు చాలదు.. ఉదయం నిద్రలేవగానే బెడ్‌పై ఒక కప్పు, బ్రేక్ ఫాస్ట్ అయ్యాక మరొక కప్పు, మధ్యలో బోర్ కొడితే ఒక కప్పు, సాయంత్రం మరో కప్పు.. ఇలా రోజుకు కనీసం 5 నుంచి 6 కప్పుల టీ తాగనిదే ఎవరికీ సుదరాయించదు. 3. చాయ్ బండి.. అతను మంచి దోస్తు. ఇంట్లో రోజు మొత్తం మహా అయితే ఎన్ని కప్పులు టీ తాగుతాం. రెండు లేదా మూడు. కానీ బయటకు వస్తే.. చాయ్ బండి అతని దగ్గర ఎన్ని కప్పులైనా తాగవచ్చు. ఇలా కొందరు చాయ్ ప్రియులు పండగ చేసుకుంటారు. ఇలా చాయ్ ప్రియులు ఒక 20 మంది దొరికితే.. ఇక ఆ చాయ్ బండి అతనికి పండగే పండగ కదా. అతను త్వరగా రిచ్ అయిపోవచ్చు.
4. చాయ్‌ని రక రకాలుగా.. యాలకుల టీ, అల్లం టీ, శొంఠి-మిరియాల టీ, మసాలా టీ, ఎక్కువ పాలు, చాయ్ పొడి వేసి చేసే స్ట్రాంగ్ టీ.. ఇలా చాయ్‌లో అనేక రకాలను చాయ్ ప్రియులు ఆస్వాదిస్తారు. 5. లవర్స్‌కు.. మంచి చాయ్ వాలా దొరికితే చాలు.. లవర్స్ అక్కడ చాయ్ తాగుతూ ఎంజాయ్ చేయవచ్చు. బొమ్మరిల్లు సినిమాలో హాసిని చేసినట్టు.. టీ తాగేటప్పుడు ఎంజాయ్ చేయవచ్చు. 6. చాయ్.. ఒక వ్యసనం.. పొరపాటున ఏదైనా ఒక రోజు ఇంట్లో చక్కెర లేదా టీపొడి అయిపోయినా లేదంటే పాలు రాకపోయినా ఇక చాయ్ పెట్టరు కదా. అలాంటప్పుడు చాయ్ లవర్స్ వ్యసన పరులలా ప్రవర్తిస్తారు. చాయ్ తాగనిదే వారికి మనస్సుకు పట్టదు. వెంటనే తయారై బయటకు వెళ్లి బండి దగ్గర ఒక చాయ్ సిప్ వేస్తే గానీ వారి మనస్సు కుదుట పడదు.
7. ఎక్కడికెళ్లినా.. ఎవరైనా ఎక్కడికి వెళ్లినా మొదట ప్రియారిటీ ఇచ్చేది చాయ్‌కే. కాదంటారా.. ఇంట్లో.. ఆఫీస్‌లో.. స్టూడెంట్స్ అయితే కాలేజీ క్యాంటీన్లలో బాతాఖానీ కొడుతూ చాయ్ సేవిస్తారు. 8. ఏ కాలమైనా.. కొందరు ఎండా కాలం వస్తే చాయ్ మానేస్తారు. కానీ చాయ్ లవర్స్ అలా కాదు. వారికి కాలంతో సంబంధం లేదు. ఇక వర్షాకాలం, చలికాలంలోనైతే తాగే చాయ్‌ల సంఖ్య పెరుగుతుంది. 9. చాయ్ = ఒత్తిడి దూరం.. నిత్యం కలిగే ఒత్తిడి, అలసటలను తగ్గించడంతోపాటు, బోర్ కొట్టినప్పుడు, మూడ్ బాగాలేనప్పుడు చాయ్ తాగితే అప్పుడు హ్యాపీ మూడ్‌లోకి రావచ్చు. 10. చాయ్ లేకపోతే.. చాయ్ లవర్ల వద్దకు ఎవరైనా వచ్చి తమకు చాయ్ అంటే ఇష్టం ఉండదని, చాయ్ అసలు తాగమని చెబితే ఇక చాయ్ లవర్స్ వారిని ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారు. కాదంటారా..!