Off Beat

పేద భ‌ర్త‌కు అంద‌మైన భార్య‌.. రోజూ బ‌య‌ట వంట చేస్తుంటే అంద‌రూ ఆమెనే చూస్తారు..!

ఒక ఊరిలో కొత్తగా పెళ్ళి అయిన జంట ఒక పూరి గుడిసెలో కాపురం ఉంటారు. అతని భార్య అందంగా ఉంటుంది. పేదరికంలో ఉంటారు. రోజు ఆరుబయట వంట చేస్తూఉండేది ఆమె. ఆ ఊరిలో ఉన్న మగవారంతా ఆమెను చూస్తూ ఉండేవారు. భర్తకు ఇదంతా చూసి బాధగా అనిపించేది. అలా భార్య తో ఒకరోజు మనం చేసేది కూలీ పనేకదా ఈ ఊర్లో పరిస్థితి బాగాలేదు వేరే ఊరు వెళ్లి ఇదే పని అక్కడ చేసుకుందాం అంటాడు.

భర్త ను గౌరవించే భార్య కనుక సరే అని ఉన్న సామాను అంత సర్ది ఒక ఎద్దుల బండి లో వేసుకుంటారు. ఇంకా ఏమైనా ఉన్నాయా అని భర్త అడుగుతాడు…. అప్పుడు భార్య బైట పొయ్యి రాళ్లు 3ఉన్నాయి తెచ్చి బండి లో పెట్టండి అంటుంది. అప్పుడు భర్త అంటాడు ఈ మాత్రం రాళ్లు అక్కడ ఉండవా అని.

interesting story of a husband and wife who are poor

అప్పుడు భార్య అంటుంది ఈ మాత్రం చూసే మగవాళ్ళు ఆ ఊరిలో ఉండరా….? కావాల్సింది నమ్మకం. మన హద్దులు తప్ప వేరే వాళ్లకు భయపడ కూడదు అంటుంది. భర్త అప్పుడు అన్ని సామాన్లు దించి అదే ఊర్లో కాపురం ఉంటారు….! భార్యాభర్తల బంధం నమ్మకంతో వుండాలి. ఒకరిపట్ల ఒకరికి గౌరవము ప్రేమాభిమానాలు ఉండాలి. డబ్బు పిచ్చి మద పిచ్చి కాదు. కట్టుకున్న భార్య శరీరాన్నే కాక మనసుని ఆమె మానసిక సౌందర్యానికి ఆరాధ్యుడై ,తోడై అమెకే నీడై నిలిచి జీవితాన్ని గెలిచే ప్రతి భర్తకీ..భార్యకీ సవినయ వందనం.

Admin

Recent Posts