Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

ప్రేమ‌, ధ‌నం, గెలుపు.. ఈ మూడింటిలో ఒక‌టి కోరుకోమ్మ‌ని చెబితే మీరు ఏది కోరుకుంటారు..?

Admin by Admin
May 26, 2025
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఒక పల్లెలోని ఒక ఇంటికి చాలా రోజులు ప్రయాణం చేసి, అలసిపోయిన ముగ్గురు పెద్దవాళ్ళు వచ్చారు. రాత్రి 8 కావొస్తుంది.. ఇంట్లో దీపం వెలుతురు తప్ప మరో కాంతి లేదు… ఆ చీకట్లో వారిని చూస్తే పెద్దవారిలా కనిపించారు. దాంతో… లోపలికి రండి నా భర్త వచ్చిన వెంటనే భోజనం చేయవచ్చు మీరు అంటూ ఆ ఇంటావిడ ఆహ్వానించింది. మగవాళ్ళు లేని ఇంట్లో మేం భోజనం చేయము. అతను తిరిగివచ్చిన తరువాతే లోపలికి వస్తాము… అని బయట అరుగు మీద అలసట తీర్చుకుంటున్నారు. భర్త పొలం పని ముగించుకొని సాయంత్రం ఇంటికి వస్తుండటం గమనించి.. బయట అరుగు మీద ఉన్న వారి వద్దకు వెళ్ళి… నా భర్త వచ్చాడు లోపలికి రావడానికి మీకు అభ్యంతరం లేదు కదా… అని అడిగింది.

లేదు.. కాని మా ముగ్గురిలో ఒకడు మత్రమే మీ ఇంట్లోకి వస్తాడు అది మా నియమం…. అన్నారు. ఆ ఇల్లాలు ఆశ్చర్యంతో చూస్తుండగా ఓ పెద్దాయన ఇలా అన్నాడు…. నా పేరు ప్రేమా, ఇతని పేరు గెలుపూ, ఈయన పేరు ఐశ్వర్యం. మాలో ఒక్కరిని మాత్రమే ఆహ్వానించు… అన్నాడు. వచ్చిన వారు మాములు మనుషులు కాదని… ప్రేమ, గెలుపు, ఐశ్వర్యం అనే రూపాల్లో ఉన్న ఆశీర్వాదాలు అని తెలిసిపోయింది. సంతోషంతో పొంగిపోతు అమె ఆ విషయాన్ని భర్తకు చెప్పింది. విన్న భర్త పరవశంతో…. బ్రతుకులో గెలుపే ముఖ్యము కాబట్టి ఆయన్నే పిలుద్దాం….. అని అన్నాడు. దానికి ఆమె… ఐశ్వర్యం లేకపోతే.. గెలుపు ఒకటే ఉండి ఏమి లాభం? కాబట్టి ఐశ్వర్యంని ఆహ్వానిద్దాం… అని అంది.

love success or money which one do you want

వీరి ఇద్దరి మాటలు వింటున్న వారి కోడలు… గెలుపు, ఐశ్వర్యం కంటే ప్రేమ ఉంటే భార్యా భర్తలు, పిల్లలు, అత్తా కోడళ్ళు కలిసి మెలసి ఉండగలం కాబట్టి సుఖజీవనానికి ప్రేమే మూలాధారం…. అంటూ సలహా ఇచ్చింది. వెంటనే ఆ ఇంటి యజమాని బయటకు వచ్చి… మీలో ప్రేమ అనే వ్యక్తి లోపలికి రావచ్చు అన్నాడు. ప్రేమ అనే వ్యక్తి ఇంట్లోకి వచ్చాడు. ప్రేమ వెనకే గెలుపు, ఐశ్వర్యం కూడా అతనితో బాటు ఇంట్లోకి వచ్చాయి. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

ఆ ముగ్గురూ ఇలా అన్నారు…. మీరు గెలుపు లేదా ఐశ్వర్యం కోరి ఉంటే మిగ‌తా ఇద్దరు ఉండిపోవాల్సి వచ్చేది. కాని ప్రేమను మీరు ఆహ్వానించడంతో… మేమూ పిలవకుండానే వచ్చాము. ప్రేమ వెన్నంటే గెలుపు, ఐశ్వర్యం అనేవి నడవాలి అని మా దేవుని ఆజ్ఞ…. అని అన్నారు. కాబట్టి ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ ఐశ్వర్యం, గెలుపు తప్పక ఉంటాయి.

Tags: lovesuccesswealth
Previous Post

స‌ముద్ర గ‌ర్భంలో ఉన్న ఆల‌యం ఇది.. దీని గురించిన ఈ విశేషాలు మీకు తెలుసా..?

Next Post

యుద్ధంలో గెలుపొంద‌డం అంటే ప్రత్య‌ర్థిని చంప‌డం కాదు, విజ‌యం సాధించడం..

Related Posts

హెల్త్ టిప్స్

బ‌రువు త‌గ్గే మెడిసిన్ల‌ను వాడుతున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

July 20, 2025
వైద్య విజ్ఞానం

రోజూ స‌రిగ్గా నిద్ర పోవ‌డం లేదా..? అయితే ఏం జ‌రుగుతుందంటే..?

July 20, 2025
హెల్త్ టిప్స్

డెంగ్యూ జ్వ‌రం వ‌చ్చిందా..? అయితే ఇలా చేయండి.. త్వ‌ర‌గా కోలుకుంటారు..!

July 20, 2025
vastu

ఈ వ‌స్తువుల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ ఇంట్లో ఉంచ‌కండి.. వెంట‌నే ప‌డేయండి.. ఎందుకంటే..?

July 20, 2025
lifestyle

క‌ల‌లో మీకు దెయ్యాలు క‌నిపిస్తున్నాయా.. అయితే దాని అర్థం ఏమిటంటే..?

July 20, 2025
vastu

వాస్తు ప్ర‌కారం ఇంట్లో ఈ పెయింటింగ్‌లను అస‌లు పెట్ట‌కూడ‌దు..!

July 20, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.