Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

మునిగిపోతున్న ఓడ‌.. భార్య‌ను వ‌దిలేసి బ‌య‌ట‌కు దూకిన భ‌ర్త‌..

Admin by Admin
February 19, 2025
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఒక జంట ఓడలో ప్రయాణిస్తున్నారు. ఉన్నట్టుండి ఓడ మునిగిపోతోంది. అందరూ లైఫ్ బోట్ లోకి వెళ్తున్నారు….. ఆ లైఫ్ బోట్లో ఇంక ఒక్కరికే స్థానం ఉంది, జంట మాత్రమే ఇంక ఓడలో మిగిలింది, భార్య భర్త ఎవరో ఒక్కరే లైఫ్ బోట్లోకి వెళ్ళగలరు. ఇద్దరూ ఆలోచిస్తున్నారు, ఉన్నట్టుండి భర్త భార్యను మునిగిపోతున్న ఓడలోనే ఉంచేసి తాను మాత్రం లైఫ్ బోట్లోకి దూకేసాడు. వెనక నుంచి భార్య అరుస్తూ ఏదో చెప్తోంది. తరగతిలో పిల్లలకి ఈ కధ చెప్తున్న ఉపాధ్యాయురాలు కధ చెప్పటం ఇక్కడ ఆపేసింది. పిల్లలూ, ఆవిడ భర్తతో ఏమని ఉంటుందో చెప్పగలరా అని పిల్లలని ప్రశ్నించింది, టీచర్.

పిల్లలు ఒకేసారి చెప్పారు, ఇంత మోసమా, నిన్ను గుడ్డిగా నమ్మాను, అని ఉండచ్చు టీచర్ అన్నారు. ఒక బాబు మౌనంగా కూర్చుని ఉన్నాడు, టీచర్ ఆ బాబుని అడిగింది నువ్వేమి చెబుతావు అని. ఆ బాబు చెప్పాడు, మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి, అని చెప్పి ఉంటుంది అన్నాడు. టీచర్ కళ్ళల్లో ఆశ్చర్యం, నీకు ఈ కధ ముందే తెలుసా, అని అడిగింది. బాబు తల అడ్డంగా ఊపాడు, లేదు, నాకు ఈ కధ తెలీదు, మా అమ్మ జబ్బుతో చనిపోతూ మా నాన్నకు చెప్పింది, మన బాబు జాగ్రత్త అని.. అన్నాడు. ఈ సారి టీచర్ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఈ కధలో భార్య కూడా ఇదే చెప్పింది, నీ సమాధానం సరి అయినది అని చెప్పింది టీచర్.

ship is sinking husband left wife and jumped out side

ఇహ కధ విషయానికి వస్తే భర్త ఇంటికి చేరి తమ కూతురిని కంటికి రెప్పలా కాపాడుతూ చూసుకుంటూ, బాగా చదివించి, పెళ్ళి చేసి మంచి జీవితాన్ని కూతురికి అందించి ఒక రోజు కన్ను మూసాడు. తండ్రి వస్తువులని ఒకచోట చేర్చి పక్కన పెట్టేయాలి అని కూతురు తండ్రి వస్తువులు సర్దుతోంది. తండ్రి డైరీ కనపడింది, అందులో రాసుకున్నాడు, భార్యకు చెప్పుకుంటున్నట్టు, నీతోపాటే ఓడలో ఉండి మునిగిపోయి నీళ్ళ కిందే నీతోనే ఎప్పటికీ ఉండిపోవాలి అనిపించింది, కానీ మనమ్మాయిని ఎవరు చూసుకుంటారు, నిన్ను బతికిద్దామనుకుంటే, నీ ప్రాణాంతక జబ్బు చివరి స్టేజ్ లో ఉంది, ఎలానూ నువ్వు మరణం అంచుల్లో ఉన్నావు. మరి మనమ్మాయికి ఎవరు తోడు.అందుకే ఎక్కువ ఆలోచిస్తే బలహీనపడిపోతానేమో అనిపించి లైఫ్ బోట్లోకి దూకేసాను. మనసులో ఎంత ఏడ్చుకున్నానో నీకు తప్ప ఇంకెవరికి అర్ధం అవుతుంది, అని డైరీలో భార్యకి చెప్పుకున్నాడు.

పైపైన ఏదో చూసి ఎప్పుడూ ఎదుటి మనిషిని నిర్ణయించకూడదు, ఎవరు ఏంటీ అని, మనకి తెలియని లోతులు చాలా ఉండచ్చు వారి జీవితాల్లో. ఎప్పుడూ తొందరపడి ఏ మనిషినీ నిందించకూడదు, అనుమానించకూడదు, అవమానించకూడదు.

Tags: husbandwife
Previous Post

వాట్సప్ లో ఈ చిన్న ట్రిక్ తెలుసుకుంటే ప్రతి ఒక్కరితో ఆటాడుకోవచ్చు..! అది ఎలాగో తెలుసా.?

Next Post

నిద్రపోయాడని ఉద్యోగం నుంచి తీసేశారు, కోర్టుకెళ్లి కంపెనీదే తప్పని నిరూపించాడు, ఇత‌ను మామూలోడు కాదు !

Related Posts

హెల్త్ టిప్స్

మ‌హిళ‌లు గ‌ర్భం ధ‌రించిన‌ప్పుడు ఈ 20 ఆహారాల‌కు దూరంగా ఉండాలి..!

July 3, 2025
ఆధ్యాత్మికం

వినాయ‌కుడి క‌థ నుంచి త‌ల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యాలు ఇవే..!

July 3, 2025
వైద్య విజ్ఞానం

పురుషుల క‌న్నా స్త్రీల‌కు 20 నిమిషాలు ఎక్కువ నిద్ర అవ‌స‌రం అట‌.. ఎందుకో తెలుసా..?

July 3, 2025
lifestyle

ఇప్పుడు మ‌నం వాడుతున్న బ్లేడ్ల‌కు అలా డిజైన్ ఎలా వ‌చ్చిందో తెలుసా..?

July 3, 2025
Off Beat

తాజ్ మహల్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..? మొత్తం 1089 ర‌హ‌స్య గ‌దులు ఉన్నాయి..!

July 3, 2025
పోష‌ణ‌

మీ చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా క‌నిపించాలంటే వీటిని తీసుకోండి..!

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.