Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

రోల్స్ రాయ్స్ కార్ల‌తో చెత్త ఊడ్పించిన మ‌హా రాజు.. ఈయ‌న చేసింది తెలిస్తే షాక‌వుతారు..

Admin by Admin
June 13, 2025
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఇది 1920ల నాటి సంగతి. రాజస్థాన్‌లోని ఆళ్వార్ ప్రాంతానికి రాజైన మహారాజా జైసింగ్ ఓసారి లండన్ పర్యటనకు వెళ్లాడు. రాచ దుస్తుల్లో కాకుండా సాధారణ వ్యక్తిగా లండన్లోని బాండ్ వీధిలో వెళ్తుండగా.. ఆయనకు రోల్స్ రాయిస్ కార్ల షోరూం కనిపించింది. దీంతో ఆ కారు ధర, వివరాలు కనుక్కుందామని జై సింగ్ షోరూంలోకి వెళ్లారు. భారతీయులంటే చులకన భావం ఉన్న అక్కడి సేల్స్‌మెన్ సాధారణ వ్యక్తి అనుకొని మహారాజుతో హేళనగా మాట్లాడాడు. దాదాపుగా షోరూం నుంచి గెంటేసినంత పని చేశాడు. ఆ అవమానంతోనే హోటల్‌కు వెళ్లిన జైసింగ్.. ఆళ్వార్ మహారాజు మీ షోరూంకి వస్తున్నారు. ఆయనకు కార్లు కావాలి అని కబురు పంపారు. మహారాజు రాక కోసం షోరూం నిర్వాహకులు రెడ్ కార్పెట్ పరిచారు. ఆయనకు సకల మర్యాదలు చేశారు.

ఆ షోరూంలో ఉన్న ఆరు కార్లనూ కొనుగోలు చేసిన జై సింగ్.. ఆ కార్లను ఇండియాకు రప్పించడానికి అవసరమైన మొత్తాన్ని కూడా చెల్లించేశారు. దీంతో రోల్స్ రాయిస్ కంపెనీ ప్రతినిధులు తెగ ఆనందించారు. కార్లు భారత గడ్డ మీదకు చేరగానే.. వాటిని ఆళ్వార్ మున్సిపాలిటీలో వీధులు ఊడ్చడానికి, చెత్తను తరలించడానికి ఉపయోగించాలని మహారాజు ఆదేశించారు. దీంతో ప్రపంచంలోని అత్యంత ధనికులు మాత్రమే కొనుగోలు చేసే కారు కాస్తా.. చెత్త బండిగా మారింది. రోల్స్ రాయిస్ కార్లతో చెత్త తరలించే విషయం ఆ నోటా ఈ నోటా బయటి ప్రపంచానికి తెలిసింది. దీంతో రోల్స్ రాయిస్ కార్లను తమ దర్పానికి చిహ్నంగా భావించే వారు కాస్తా.. చెత్తబండిగా భావించడం మొదలు పెట్టారు.

this king in india made rolls royce cars as sweeping vehicles

మా కార్లు కొనండి అని రోల్స్ రాయిస్ ప్రతినిధులు ఎవరినైనా అడిగితే.. ఇండియాలో మీ కార్లను చెత్త తరలించేందుకు వాడుతున్నారట కదా.. అవి మాకొద్దు అనే వాళ్ల సంఖ్య పెరగడంతో కార్ల అమ్మకాలు పడిపోయాయి. దీంతో లబోదిబోమని గుండెలు బాదుకున్న కంపెనీ ప్రతినిధులు నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు. మహాప్రభో.. లండన్లో మీకు జరిగిన అవమానానికి చింతిస్తున్నాం. మమ్మల్ని క్షమించండి. మీకు మరో ఆరు రోల్స్ రాయిస్ కార్లు పంపిస్తున్నాం. కానీ మీరు మాత్రం మీ దగ్గరున్న కార్లను చెత్త తరలించడానికి, వీధులు ఊడ్చడానికి వాడొద్దంటూ ఓ టెలీగ్రాం పంపించారు. దీంతో శాంతించిన మహారాజు.. చెత్త తరలించే కార్యక్రమం నుంచి రోల్స్ రాయిస్ కార్లను మినహాయించారు. దీంతో ఆ కంపెనీ ఊపిరి పీల్చుకుంది. ఓ భారతీయుడితో పెట్టుకుంటే ఏమవుతుందో ఆ కంపెనీకి తెలిసొచ్చింది…

Tags: rolls royce
Previous Post

కాలు మీద కాలు వేసి కూర్చుంటున్నారా.. అయితే అలా చేయ‌కండి.. ఎందుకంటే..?

Next Post

మ‌నిషి రూపాన్ని చూసి ఎన్న‌డూ అంచ‌నా వేయ‌కూడ‌దు.. ఆలోచింప‌జేసే క‌థ‌..

Related Posts

vastu

పడక గది ఏ మూలన ఉంటే మీకు మంచి జరుగుతుందో తెలుసా?

July 13, 2025
vastu

లాఫింగ్ బుద్ధా విగ్రహం ఎలా ఉంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా..?

July 13, 2025
వైద్య విజ్ఞానం

ఉమ్మిని మింగ‌డం మంచిదా..? లేదా ప‌దే ప‌దే ఊసేయాలా..?

July 13, 2025
చిట్కాలు

మ‌జ్జిగ‌లో వీటిని క‌లిపి తాగండి.. మ‌ల‌బ‌ద్దకం అన్న మాటే ఉండ‌దు..!

July 13, 2025
హెల్త్ టిప్స్

కొలెస్ట్రాల్ అధికంగా ఉందా..? అయితే ఈ ఆహారాల‌ను రోజూ తినండి..!

July 13, 2025
హెల్త్ టిప్స్

ఈ కూర‌గాయ‌ల‌ను రోజూ తింటే చాలు.. షుగ‌ర్ అన్న మాటే ఉండ‌దు..!

July 13, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.